ETV Bharat / state

జనవరి 6 తరువాత మల్లాడి రాజకీయ విరమణ - పుదుచ్చేరి ఆరోగ్యమంత్రి మల్లాడి కృష్ణారావు రాజకీయ విరమణ

జనవరి 6 తరువాత రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్తానని పుదుచ్చేరి ఆరోగ్యమంత్రి మల్లాడి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

malladi, annavaram
అన్నవరం, మల్లాడి కృష్ణారావు, పుదుచ్చేరి
author img

By

Published : Jan 1, 2021, 4:52 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు దర్శించుకున్నారు. జనవరి 6 తర్వాత రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్తానని ఆయన తెలిపారు. దైవ కార్యక్రమాలు, యానాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని భావిస్తున్నానని అన్నారు.

ఆరు సార్లు యానాం ఎమ్మెల్యేగా, మూడు సార్లు మంత్రిగా, మూడు సార్లు ఉత్తమ శాసనసభ్యునిగా సేవలందించానని మల్లాడి తెలిపారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేశానని... రజతోత్సవం తర్వాత రాజకీయాలకు స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

అన్నవరంలోని స్వామి వారి సేవలో కుటుంబ సమేతంగా మల్లాడి కృష్ణారావు

ఇదీ చూడండి: ప్రజలకు మరింత చేరువై మన్ననలు పొందాలి: డీజీపీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.