ETV Bharat / state

కిటకిటలాడిన ముషీరాబాద్​ చేపల మార్కెట్​

author img

By

Published : May 16, 2021, 1:16 PM IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఎంతో మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నా... ఇప్పటీకీ కొవిడ్​ అంటే చాలామందిలో ఏ మాత్రం భయం కనిపించడం లేదు. ముషిరాబాద్​ చేపల మార్కెట్​లో ఆదివారం పరిస్థితిని చూస్తే... అది నిజమనే అనిపిస్తుంది. నిబంధనలు పాటించకుండా ఇలాగే కొనసాగితే మహమ్మారి రెండో దశ ఫలితాలు దారుణంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

People do not care about the corona rules at Musheerabad fish market
చేపల మార్కెట్​లో కిటకిటలాడుతున్న ప్రజలు

యావత్​ దేశాన్ని కరోనా గడగడలాడిస్తున్న తరుణంలో... వైరస్​ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్​ విధించింది. ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో... ముషీరాబాద్ చేపల మార్కెట్​లో కొనుగోలుదారులు కిటకిటలాడుతున్నారు. వందలాది మంది ఏ మాత్రం కొవిడ్​ నిబంధనలు పాటించకుండా మార్కెట్​లో తిరుగుతున్న దృశ్యాలు... వైరస్​ పట్ల వారి అలసత్వానికి అద్దం పడుతున్నాయి.

చేపల మార్కెట్​లో కిటకిటలాడుతున్న ప్రజలు

ప్రభుత్వ యంత్రాంగం కరోనా నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకున్నా... చాపల మార్కెట్​కు వచ్చే ప్రజలు, వ్యాపారులు మాత్రం తమకు ఏం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలాగే కరోనాను నిర్లక్ష్యం చేస్తే రెండవ దశలో ఫలితాలు మరింత దారుణంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినా... ప్రజల్లో మార్పు రానంత వరకూ కరోనా నియంత్రణ సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

తీవ్రంగా నష్టపోయాం...

లాక్​డౌన్​ కారణంగా తమ వ్యాపారం తీవ్రంగా దెబ్బతిందని ఓ వ్యాపారి అన్నారు. ప్రతి ఆదివారం కనీసం 200 నుంచి 400 కిలోల చేపల అమ్మకాలు చేసేవారమని తెలిపారు. ప్రభుత్వం సడలించిన లాక్ డౌన్ సమయం వల్ల తమకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. సడలింపు సమయాన్ని మరింత పెంచాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'రూపాంతర వైరస్‌పై టీకాల ప్రభావం స్వల్పం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.