పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అన్నారు. ప్రపంచంలో ప్రతి నిమిషానికి 50 వేల హెక్టార్ల చెట్లు అంతరించిపోతున్నాయని... ఇలాగే కొనసాగితే మానవుని మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలో గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఆధ్వర్యంలో 'సాంకేతికత... పర్యావరణ సమతుల్యత' అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డీజీ బి.కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు వాయు కాలుష్యాన్ని నివారించేందుకు కొత్త పద్ధతులు కనుగొనాలని రామయ్య సూచించారు.
ఇదీ చూడండి : చెత్తతో కూర్చీలు, సోఫా... దానమిచ్చేస్తారు