ETV Bharat / state

బెడ్లు రిజర్వు చేసుకున్న వారికే రాష్ట్రంలోకి అనుమతి: డీహెచ్‌ - dh srinivasa rao on other state ambulances

ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు కరోనా చికిత్స కోసం వచ్చే వారు ముందుగానే బెడ్లను రిజర్వు చేసుకోవాలని.. అలాంటి వారికే రాష్ట్రంలోకి అనుమతిస్తామని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాసరావు వెల్లడించారు. పడకలు రిజర్వ్‌ చేసుకోకుండా రాష్ట్రానికి వచ్చి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేశారు. విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు.

రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాసరావు

author img

By

Published : May 14, 2021, 3:26 PM IST

రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాసరావు

వేలాది మంది ఇతర రాష్ట్రాల రోగులకు వైద్యం అందించామని, ఏ రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టాలని తాము అనుకోవట్లేదని ప్రజారోగ్య సంచాలకులు డా.శ్రీనివాసరావు అన్నారు. ఏపీతో సహా ఇతర రాష్ట్రాల నుంచి చికిత్స కోసం హైదరాబాద్‌ వచ్చే రోగులను సరిహద్దులోనే ఆపివేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు.

పొరుగు రాష్ట్రం నుంచి బయలుదేరడానికి ముందే ఇక్కడి ఆస్పత్రిని సంప్రదించాలి. దాదాపు 45 శాతం పడకలు ఇతర రాష్ట్రాల రోగులతో ఉండేవి. పడకలు లేకుండా వచ్చి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయమై ఏపీ, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల ప్రభుత్వాలకు సీఎస్‌ లేఖ రాశారు. ఆస్పత్రి వారే రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు పంపుతారు. ఆ వివరాలను పరిశీలించి అనుమతిస్తాం. ఇతర రాష్ట్రాల ప్రజలకు వైద్యం చేయబోమని మేము ఎప్పుడూ చెప్పలేదు. ఏ రాష్ట్రాల ప్రజలను ఇబ్బంది పెట్టాలని మేం అనుకోవట్లేదు.

- డీహెచ్‌ శ్రీనివాసరావు

ఈ రోజు ఉదయం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఐదుగురు రోగులను రాష్ట్రంలోకి అనుమతి ఇచ్చామని డీహెచ్‌ వివరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్స్ కోసం స్టేట్ కంట్రోల్ రూమ్‌ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మన దగ్గర మెడిసిన్, బెడ్స్‌ని ఇతర రాష్ట్రాల వారితో పంచుకుంటున్నామన్న ఆయన.. బిహార్, దిల్లీ నుంచి సైతం రోగులు ఇక్కడికి వస్తున్నారని అన్నారు. కేంద్రం ఇస్తున్న ఆక్సిజన్ ఏ రోజుకి ఆ రోజే సరిపోతుందని.. ఫలితంగా ఆక్సిజన్‌ ఆడిట్‌ విధానం పెట్టుకున్నామని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఏ రాష్ట్రం నుంచైనా తెలంగాణకు రావచ్చునని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రాలకు కార్గో, పార్శిల్ సేవలు నిలిపివేత: టీఎస్ఆర్టీసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.