రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను ప్రభుత్వం సక్రమంగా చూపడం లేదని ఎంపీ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గురువారం మొత్తం కేసులు 18,570 అని హెల్త్ బులిటెన్లో చూపించారని... అదే లైవ్ డ్యాష్ బోర్డులో మాత్రం 21,393 అని చూపిస్తోందని ఆరోపించారు. హెల్త్ బులిటెన్కి వాస్తవాలకు దాదాపు 3,000 కేసుల తేడా ఉందని పేర్కొన్నారు. కరోనా కేసుల సంఖ్య విషయంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నారని తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ వాస్తవ లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... 20వేలు దాటిన కేసుల సంఖ్య