కరోనా వ్యాధితో ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది సేవలను ఎమ్మెల్సీ రాంచందర్ రావు కొనియాడారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచనల మేరకు... హైదరాబాద్ పాత ఎమ్మెల్యేల గృహ సముదాయంలో జీహెచ్ఎంసీ అధికారులకు పండ్ల రసాలను పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపల్ అధికారులు, సిబ్బందికి వేయి లీటర్ల జ్యూస్‌ను అందించినట్లు తెలిపారు. దీని వల్ల విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ సిబ్బందికి రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఎమ్మెల్సీ రాంచందర్ రావు వెల్లడించారు.
పారిశుద్ధ్య కార్మికులకు ఫ్రూట్‌జ్యూస్ పంపిణీ - MLC Ram Chander Rao distributes fruit juice to sanitation workers
లాక్డౌన్ సమయంలో అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపల్ సిబ్బందికి భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు వెయ్యి లీటర్ల ఫ్రూట్ జ్యూస్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు.