ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల, కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నేడు నోటిఫికేషన్ వెలువడనుంది.
మార్చి 22న ఎన్నికలు
మార్చి 5వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 6న పరిశీలన, 8న ఉపసంహరణకు గడువు నిర్ణయించారు. 22న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 26న ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికలు జరిగే జిల్లాలో ఎన్నికలనియమావళి అమల్లోకి వచ్చింది.
ఇవీ చదవండి:ఎన్నికలకు కసరత్తు