ETV Bharat / state

తహసీల్దార్​ మృతిపై స్పందించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి - ఎమ్మెల్యే జగ్గారెడ్డి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి హత్యపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పలువురు కాంగ్రెస్​ నేతలు స్పందించారు. తహసీల్దార్​పై ఇలాంటి ఘటన జరగడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు.

తహసీల్దార్​ మృతిపై స్పందించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి
author img

By

Published : Nov 4, 2019, 8:19 PM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం బాధాకరమని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్ర రెవెన్యూ అధికారులపై ధర్మగంట పేరుతో ఓ పత్రిక తెలంగాణ ప్రజల్లో విషాన్ని నూరిపోసిందని ఆయన ఆరోపించారు. పాత రెవెన్యూ చట్టంలో రైతులకు-అధికారులకు మధ్య వెసులుబాటు ఉండేదని... రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ చేసిన మార్పులు అధికారులకు-రైతులకు మధ్య వైరాన్ని సృష్టించాయన్నారు.

కొంతకాలంగా రెవెన్యూ ఉద్యోగులపై ప్రజల్లో విద్వేషం పెరిగేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని కాంగ్రెస్​ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద, పీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి, సీనియర్‌ నేత హనుమంతురావు ఆరోపించారు. విజయారెడ్డి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు.

తహసీల్దార్​ మృతిపై స్పందించిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఇదీ చూడండి: ఇకపై రైరై... హైదరాబాద్​లో మరో పైవంతెన ప్రారంభం

TG_HYD_45_04_JAGGAREDDY_REACTION_ON_GOVT_AB_3038066 Reporter: Tirupal Reddy ()అబ్దుల్లాపూర్‌ మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఓ పత్రిక తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ అధికారులపై ధర్మగంట ఏర్పాటు చేసి ప్రజల్లో విషయాన్ని నూరిపోసిందని ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ రెవెన్యూ చట్టం...రైతులకు...అధికారులకు మధ్య వెసులుబాటు ఉండేదని...రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ చేసిన మార్పులు అధికారులకు -రైతులకు మధ్య వైరాన్ని సృష్టించాయన్నారు. ధర్మగంట కారణంగాన్నే ప్రజల్లో రెవెన్యూ అధికారులపై ద్వేషం పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెవెన్యూ శాఖపై వ్యవహరించిన తీరే నేడు ఎమ్మార్వో విజయారెడ్డి బలికి కారణమైందని ఆరోపించారు. లంచాన్ని అరికట్టడం ఎవరితో సాధ్యం కాదన్న ఆయన ఎమ్మార్వో మృతి ఘటనలో ఉద్యోగ సంఘాల నాయకుల తప్పుందని ద్వజమెత్తారు. కేసీఆర్ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు గుడ్డిగా సమర్థిస్తూ వస్తుండడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్ , రాజేందర్, ఉద్యోగ సంఘాల నేతలు రవీందర్ రెడ్డి, మమతలే..ఎమ్మార్వో చావుకు కారకులని ఆరోపించారు. రైతు ఆవేశానికి ప్రభుత్వం విధానాలు కారణం కాగా... ఎమ్మార్వో చావుకు ఉద్యోగ సంఘాల తీరే కారణమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని.... అధికారులకు....ప్రజలకు మధ్య సుహ్రుద్భావ వాతావరణం పెరిగేట్లు చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మేల్కొనకపోతే...రాష్ట్రం అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. బైట్: జగ్గా రెడ్డి, సంగా రెడ్డి ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.