ETV Bharat / state

'కంటోన్మెట్​ అభివృద్ధికి ప్రతినెలా రూ.10కోట్లు' - కంటైన్​మెంట్​ ప్రజల సమస్యల తాజా వార్తలు

కంటోన్మెంట్​‌ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల రూ. 10 కోట్ల చొప్పున విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. గురువారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కంటోన్మెంట్​ బోర్డ్ సీఈవో, బోర్డ్ సభ్యులు హరీశ్‌ రావును ఆయన కార్యాలయంలో కలిసారు. కంటోన్మెంట్​‌ ప్రాంత అభివృద్ధి, ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నుంచి రావలసిన రూ. 80 కోట్లను విడుదల చేయాలని కోరారు.

'కంటైన్‌మెంట్‌ ప్రజల కోసం ప్రతి నెల 10 కోట్లు విడుదల'
కంటోన్మెట్​ అభివృద్ధికి ప్రతినెలా రూ.10కోట్లు
author img

By

Published : Jul 2, 2020, 10:57 PM IST

Updated : Jul 2, 2020, 11:37 PM IST

కంటోన్మెంట్​‌ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. గురువారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కంటోన్మెంట్​ బోర్డ్ సీఈవో, బోర్డ్ సభ్యులు హరీశ్‌ రావును ఆయన కార్యాలయంలో కలిసారు. కంటోన్మెంట్​‌ ప్రాంత అభివృద్ధి, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం నుంచి రావలసిన రూ. 80 కోట్లను విడుదల చేయాలని కోరారు.

బుధవారం కంటోన్మెంట్​‌ బోర్డ్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అద్యక్షతన జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులకు నిధులు లేవని, ప్రభుత్వమే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని బోర్డు సభ్యులు మంత్రులను కోరారు. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ మంత్రిని కలిసి పరిస్థితులను వివరించారు.

కంటోన్మెంట్​‌ ప్రాంతం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని హరీశ్ రావు పేర్కొన్నారు. అయితే అక్కడి ప్రజల బాగోగులను కేంద్రం పట్టించుకోనందున.. దేశంలోని ఏ కంటోన్మెంట్​లో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తుందన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ వర్తింప చేస్తుందని వెల్లడించారు. కంటోన్మెంట్​‌ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల రూ. 10 కోట్ల చొప్పున విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు.

ఇది చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

Last Updated : Jul 2, 2020, 11:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.