దేశ ఆర్థికవ్యవస్థ కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడం ఎప్పటికీ మంచిది కాదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని సీఎంఆర్ ఐటీ కళాశాల ఆడిటోరియంలో స్ట్రీట్ కాజ్ అనే సంస్థ నిర్వహించిన బృంద చర్చలో మంత్రి పాల్గొన్నారు.
ఏటా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి.. దాతల ద్వారా వచ్చిన సొమ్మును గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు వినియోగిస్తున్నామని స్ట్రీట్ కాజ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కరోనా టీకాపై పుకార్లను నమ్మవద్దని.. శాస్త్రవేత్తల శ్రమను చులకన చేసి మాట్లాడటం సరికాదని బృందచర్చలో ఈటల పేర్కొన్నారు. ప్రజలందరి జీవన ప్రమాణాలు సమానంగా మారినపుడే దేశం పురోగమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.