ఏపీ తూర్పు గోదావరి జిల్లాలో యువకుడి శిరోముండనం వ్యవహారంలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని బీఎస్పీ, పలు సంఘాలు డిమాండ్ చేశాయి. బాధిత యువకుడు ప్రసాద్‌ను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం ఆసుపత్రి వద్దకు జక్కంపూడి రాజా, మేరుగ నాగార్జునతో కలిసి వచ్చిన స్త్రీ శిశు, సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను స్థానిక ప్రతినిధులు నిలదీశారు.
శిరోముండనం చేసేందుకు పోలీసులపై ఒత్తిడి తెచ్చిన కవల కృష్ణమూర్తి సంగతేంటని మంత్రిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన పోలీసులపై ఇప్పటికే చర్యలు తీసున్నామని... నిందితులు ఎవరైనా చర్యలు తప్పవని మంత్రి వనిత చెప్పారు.
అంతకుముందు ఇటీవల అత్యాచారానికి గురైన బాధితురాలిని మంత్రి వనిత పరామర్శించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిందితులకు శిక్ష పడుతుందని భయపడవద్దని సూచించారు.
ఇదీ చూడండి : ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలను లెక్కచేయట్లేదు: రాంచందర్ రావు