హైదరాబాద్ పరిధిలోని రహ్మత్ నగర్, ఇంద్రనగర్ ప్రాంతాల్లో మధుకాన్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు కిరాణా సామగ్రి పంపిణీ చేశారు. ఆపద సమయంలో ఆదుకునేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ ముందే ఉంటుందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సీతయ్య అన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు కృషి చేయాలని ఆయన సూచించారు.
తమ కుమార్తె రేణుక పుట్టిన రోజును పురస్కరించుకుని పెద్ద ఎత్తున సరుకులు పంపిణీ చేశామని సీతయ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను నిర్మూలించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి : రాష్ట్ర రైతులు సన్నబియ్యమే పండించేలా చూడాలి : సీఎం కేసీఆర్