సురారం ఉమా మహేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ ఆలయంలో సొరంగ మార్గం గుండా పరమశివుడి దర్శనానికి భక్తులు వెళతారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
దర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి : వేయి స్తంభాల ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు