ETV Bharat / state

హుజూర్​నగర్​లో గులాబీ జెండా ఎగురవేస్తాం: మంత్రి కేటీఆర్​​

author img

By

Published : Sep 26, 2019, 12:11 AM IST

హుజూర్​నగర్​లో మొదటిసారి గులాబీ జెండా ఎగురవేయబోతున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. 30 మంది పార్టీ నేతలను ఇంఛార్జీలుగా నియమించినట్లు తెలిపిన కేటీఆర్​... ప్రచారంలో సీఎం కేసీఆర్​ కూడా పాల్గొననున్నట్లు చెప్పారు. తెలంగాణ భవన్​లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్​​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

KTR CHIT CHAT WITH MEDIA ABOUT HUZURNAGAR BY ELECTIONS
హుజూర్​నగర్​లో గులాబీ జెండా ఎగురవేస్తాం: మంత్రి కేటీఆర్​​

హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో గెలిచి... గులాబీ జెండా ఎగురవేస్తామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్​లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్​... ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించి వినమ్రంగా ఓట్లు అడుగుతామన్నారు. హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో... కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్​కు లాభం... తెరాస గెలిస్తే ప్రజలకు లాభం అనేది తమ నినాదమని తెలిపారు. ముప్పై మంది నేతలను ఇంఛార్జీలుగా నియమించినట్లు చెప్పారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తెరాసకు 54 శాతం... కాంగ్రెస్​కు 42 శాతం... భాజపాకు కేవలం రెండున్నర శాతం ప్రజల మద్దతు ఉన్నట్లు తేలిందని కేటీఆర్ వివరించారు. తొమ్మిది నెలల పాలనకు ఉపఎన్నిక రెఫరెండంగా పరిగణిస్తారా... అన్న సవాళ్లను సీరియస్​గా తీసుకోమన్నారు. గతంలోనూ ఉత్తమ్ ​కుమార్ రెడ్డి సవాళ్లు విసిరి వెనక్కి తగ్గారని గుర్తుచేశారు.

అంతా సానుకూల వాతావరణమే....

ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొంటారని తెలిపిన కేటీఆర్​.... సభల షెడ్యూలు ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో హుజూర్​నగర్ రైతులందరూ తెరాస వైపే ఉన్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉపఎన్నికలన్నింటిలోనూ తెరాస విజయం సాధించిందన్నారు. హుజూర్​నగర్​లో 2018 ఎన్నికల్లోనే సాంకేతికంగా తెరాస గెలిచిందని... ట్రక్కు గుర్తు కారణంగానే ఓడిపోయినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఉత్తమ్ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా కొంత ప్రభావితం చేసి ఉండొచ్చునన్నారు. ఇప్పుడు ప్రతికూలతలు లేవని... అంతా సానుకూల వాతావరణమే ఉందని కేటీఆర్ తెలిపారు. సాగర్ రైతులందరూ సంతోషంగా ఉన్నారని.. సైదిరెడ్డిపై సానుభూతి కూడా ఉందన్నారు. కేబినెట్ విస్తరణ తర్వాత పార్టీలో అసంతృప్తి అన్నది కేవలం మీడియా సృష్టేనని కేటీఆర్ కొట్టిపారేశారు.

ఇవీ చూడండి: 'పురపాలికను ఆదర్శంగా తీర్చిదిద్దడాన్ని సవాలు స్వీకరించండి'

TG_HYD_110_25_KTR_CHIT_CHAT_PKG_3064645 REPORTER: Nageshwara Chary ( ) హుజూర్ నగర్ లో మొదటిసారి గులాబీ జెండా ఎగరవేయబోతున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు ధీమా వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ లో 30 మంది పార్టీ నేతలను ఇంచార్జిలుగా నియమించినట్లు తెలిపారు. కేసీఆర్ కూడా ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. తెరాసకు 54 శాతం... కాంగ్రెస్ కు 42 శాతం మద్దతు ఉన్నట్లు తాజా సర్వేలో తేలిందని వెల్లడించారు. ప్రభుత్వ పాలనకు ఉపఎన్నిక రెఫరెండం అన్న సవాళ్లను సీరియస్ గా తీసుకోబోమని.. తమ పని తాము చేసుకొని గెలుస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. look వాయిస్ ఓవర్: హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరుతామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరించి వినమ్రంగా ఓట్లు అడుగుతామన్నారు. హుజూర్ నగర్ ఎన్నికల్లో... కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కు లాభం... తెరాస గెలిస్తే ప్రజలకు లాభం అనేది తమ నినాదమని తెలిపారు. తమకు పోటీ కాంగ్రెస్ తోనే ఉంటుందని.. భాజపాతో కాదన్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తెరాసకు 54 శాతం... కాంగ్రెస్ కు 42 శాతం... భాజపాకు కేవలం రెండున్నర శాతం ప్రజల మద్దతు ఉన్నట్లు తేలిందని కేటీఆర్ వివరించారు. తొమ్మిది నెలల పాలనకు ఉపఎన్నిక రెఫరెండంగా పరిగణిస్తారా అన్న సవాళ్లను సీరియస్ గా తీసుకోమని కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాళ్లు విసిరి వెనక్కి తగ్గారన్నారు. కాబట్టి అర్థం పర్థం లేని సవాళ్లకు స్పందించకుండా తమ పని తాము చేసుకుంటామని వ్యాఖ్యానించారు. వాయిస్ ఓవర్: హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ముప్ఫై మంది నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు... రేపటి నుంచి వారందరూ క్షేత్రస్తాయిలో రంగంలోకి దిగుతారని కేటీఆర్ తెలిపారు. ముప్ఫై మంది నేతలతో తెలంగాణ భవన్ లో సమావేశమై వ్యూహాలు ఖరారు చేశారు. త్వరలో మున్సిపాల్టీల ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. మున్సిపాల్టీలు లేని నేతలకు బాధ్యతలు అప్పిగంచినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రచారం చేస్తారని.. సభల షెడ్యూలు ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. తన ప్రచారం ఎలా ఉండాలనే విషయాన్ని కూడా త్వరలో ఖరారు చేస్తామన్నారు. ఎన్నిక ఎన్నికేని... హుజూర్ నగర్ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంటామన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో హుజూర్ నగర్ రైతులందరూ తెరాస వైపే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. వాయిస్ ఓవర్: మరో నాలుగేళ్ల మూడు నెలల పాటు అధికారంలో ఉంటుంది కాబట్టి.. విజ్ఞులైన హుజూర్ నగర్ ఓటర్లు తెరాసను గెలిపించుకుంటారని కేటీఆర్ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు స్పష్టత ఉందని.. పార్లమెంటు ఎన్నికలకు.. ఉపఎన్నికలకు తేడా వారికి తెలుసునని.. కాంగ్రెస్ కు ఓటు వేయడం వల్ల లాభం లేదని తెలుసన్నారు. అయినా పార్లమెంటు ఎన్నికల్లో తాము పరాభవం పొందలేదని.. మెజారిటీ సీట్లు గెలిచామని.. ఓడిన చోట స్వల్ప తేడాతోనే కోల్పోయామని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఉపఎన్నికలన్నింటిలోనూ తెరాస విజయం సాధించిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు తరువాత జరిగిన పరిషత్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. హుజూర్ నగర్ లో 2018 ఎన్నికల్లోనే సాంకేతికంగా తెరాస గెలిచిందని.. ట్రక్కు గుర్తు కారణంగానే ఓడిపోయినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఉత్తమ్ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కూడా కొంత ప్రభావితం చేసి ఉండొచ్చునన్నారు. ఇప్పుడు ప్రతికూలతలు లేవని... అంతా సానుకూల వాతావరణమే ఉందని కేటీఆర్ తెలిపారు. సాగర్ రైతులందరూ సంతోషంగా ఉన్నారని.. సైదిరెడ్డిపై సానుభూతి కూడా ఉందన్నారు. కేబినెట్ విస్తరణ తర్వాత పార్టీలో అసంతృప్తి అన్నది కేవలం మీడియా సృష్టేనని కేటీఆర్ కొట్టిపారేశారు. ఎండ్..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.