ETV Bharat / state

'అవినీతిని అంతమొందించేందుకు కొత్త రెవెన్యూ చట్టం' - TRS

పంచాయతీరాజ్, కొత్త మున్సిపల్, కొత్త రెవెన్యూ చట్టాల ద్వారా క్షేత్రస్థాయిలో అవినీతిని తొలగించగలిగినప్పుడే ప్రజలకు పరిపాలనా వ్యవస్థల మీద నమ్మకం, గౌరవం పెరుగుతాయి: ముఖ్యమంత్రి కేసీఆర్

'అవినీతిని అంతమొందించేందుకు కొత్త రెవెన్యూ చట్టం'
author img

By

Published : Jun 2, 2019, 10:12 AM IST

నూతన పంచాయతీ రాజ్ చట్టం పరిధిలో గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలో పని చేసే ప్రజాప్రతినిధులు, అధికారులకు గ్రామాల పారిశుద్యం పాటించడం, పచ్చదనం పెంచడం విధిగా పాటించవలసిన నిబంధన ఉంటుందని వివరించారు. తమ విధుల నిర్వహణలో విఫలమయిన వారికి ఈ చట్టం కఠినమైన శిక్షలు విధిస్తుందని, అవసరమైతే పదవుల నుంచి కూడా తొలగిస్తుంది కేసీఆర్ తెలిపారు. ఈ చట్టాన్ని కఠినంగా అమలు పరిస్తే... గ్రామాలన్నీ పచ్చదనానికి, పరిశుభ్రతకు పట్టుగొమ్మలుగా మారాతాయని చెప్పారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టం, కొత్త రెవెన్యూ చట్టం పకడ్బందీగా అమలు కావడం కోసం పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు కావాలని కేసీఆర్ కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.