ETV Bharat / state

డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చాలి: జగ్గారెడ్డి - ముఖ్యమంత్రి కేసీఆర్‌

డెంగీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న వ్యాధి. ఈ జ్వరం కుటుంబంలో ఇద్దరికో.. ముగ్గురికో వచ్చిందంటే అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని దీనిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.

డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చాలి: జగ్గారెడ్డి
author img

By

Published : Nov 21, 2019, 6:19 PM IST

డెంగీ, క్యాన్సర్‌ వ్యాధుల నుంచి ప్రజలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, చిన్నజీయర్‌ స్వామిలకు లేఖలు రాయనున్నట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ రెండు వ్యాధులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డెంగీ రోగం వస్తే.... తక్కువలో తక్కువ 60వేలు నుంచి లక్ష వరకు ఖర్చు అవుతోందని తెలియజేశారు. డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అదే విధంగా క్యాన్సర్‌ వస్తే లక్ష నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తోందని పేద, మధ్య తరగతి ప్రజలు భరించలేకపోతున్నారని వెల్లడించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, చిన్న జీయర్‌ స్వామి స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చాలి: జగ్గారెడ్డి

ఇదీ చూడండి: మరింత అందంగా భాగ్యనగరం..

TG_HYD_37_21_JAGGAREDDY_ON_DENGUE_AB_3038066 Reporter: Tirupal Reddy గమనిక: ఫీడ్‌ సీఎల్పీ ఓఎఫ్‌సీ నుంచి వచ్చింది. గమనించగలరు. ()డెంగ్యూ, క్యాన్సర్‌ వ్యాధుల నుంచి ప్రజలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, చిన్నజియ్యర్‌ స్వామిలకు లేఖలు రాయనున్నట్లు సంగా రెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఈ రెండు వ్యాధులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అటు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌లతోపాటు అనేక మంది పెద్దలు ఆయన వద్దకు వెళ్లుతుంటారన్నారు. అందువల్ల ధనికలైన భక్తుల సహకారంతో...డెంగ్యూ, క్యాన్సర్‌ లాంటి రోగాలకు ఉచితంగా వైద్యం అందించేందుకు వీలుగా ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలని చిన్నజియ్యర్‌ స్వామకి ఆయన విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ రోగం వస్తే....తక్కువలో తక్కువ 60వేలు నుంచి లక్ష వరకు ఖర్చు అవుతోందని...ఇంట్లో ముగ్గురికో...నలుగురికో వస్తే...అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. అదే విధంగా క్యాన్సనర్‌ రోగం వస్తే లక్ష నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు వస్తోందని పేద,మధ్య తరగతి ప్రజలు భరించలేకపోతున్నారని, ఉన్న తులమో...ఫలమో ఆస్తులు అమ్ముకున్నా బతికించుకోలేకపోతున్నారన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, చిన్న జియ్యర్‌ స్వామిలు స్పందించాల్సి ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు. బైట్: జగ్గారెడ్డి, సంగా రెడ్డి ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.