హైదరాబాద్ బంజారాహిల్స్లో జగన్నాథ రథయాత్ర వైభవంగా జరిగింది. గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథయాత్రకు భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. హరినామస్మరణ చేస్తూ జగన్నాథ స్వామివారి రథాన్ని ముందుకు నడిపించారు. జగన్నాథ ఆలయం నుంచి రోడ్ నెంబర్ 12లోని అమ్మవారి ఆలయం వరకు యాత్ర కొనసాగింది. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. దారి పొడవున పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రథయాత్ర మార్గంలో ట్రాఫిక్ మళ్లించారు.
ఇవీ చూడండి: అతివేగం.... అదుపుతప్పిన కారు...