Kavitha defamation case against BJP leaders దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించిన అంశంలో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ దిల్లీకి చెందిన భాజపా ఎంపీ పర్వేశ్‌వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిర్సాలపై తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఆమె మంగళవారం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు 9వ చీఫ్ జడ్జి ముందు ఇంజక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె పిటిషన్‌పై విచారణ జరిపిన సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్సీ కవిత పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేయొద్దని ఎంపీ పర్వేశ్‌వర్మ, మాజీ ఎమ్మెల్యే మజుందర్ సిర్సాలను కోర్టు ఆదేశించింది. సభలు, మీడియా, సామాజిక మాధ్యమాల్లో నిరాధార ఆరోపణలు చేయొద్దని పేర్కొంటూ పర్వేశ్‌వర్మ, మజుందర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను న్యాయస్థానం సెప్టెంబరు 13కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: భాజపా నేతలపై దావా వేసిన ఎమ్మెల్సీ కవిత