హైదరాబాద్ రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి అదృశ్యమైంది. నల్లగుట్టలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ తేజస్విని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువు కుంటుంది. ఈనెల 21న కళాశాలకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన విద్యార్థి తిరిగి ఇంటికి రాలేదు. విద్యార్థిని ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికిన ఫలితం దక్కలేదు. 21 న కళాశాలకు కూడా తేజస్విని రాలేదని యాజమాన్యం తెలిపింది. ఆందోళన చెందిన బంధువులు రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విద్యార్థి అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. త్వరలోనే తేజస్విని జాడ తెలుసుకుంటామన్నారు.
ఇవీ చూడండి: నమ్మించి మోసం చేశాడు... వితంతువు ఆవేదన