ETV Bharat / state

IFMIS TS Employee Pay Slip Download : టీఎస్ ఉద్యోగుల Pay Slip.. ఇలా డౌన్​లోడ్ చేసుకోండి!

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 1:41 PM IST

IFMIS Telangana Employee Pay Slip Download : ఉద్యోగి గుర్తింపును నిర్ధారించేది ఐడీ కార్డ్ అయితే.. ఎంప్లాయ్ సంపాదనను నిర్ధారించేది Pay Slip. "బేసిక్ సాలరీ" మొదలు.. కటింగ్స్​ పోగా.. చేతిలో పడే "నెట్ సాలరీ" దాకా ప్రతీ వివరం అందులో ఉంటుంది. ఈ పే స్లిప్​ను ప్రభుత్వ ఉద్యోగులు ఆన్​లైన్​లోనే అందుకోవచ్చు. మరి, మీరు డౌన్​లోడ్ చేసుకుంటున్నారా..?

IFMIS Telangana Employee Pay Slip
IFMIS TS Employee Pay Slip Download

How to Download IFMIS Telangana Employee Pay Slip : బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డు వంటి దరఖాస్తులకు మొదలు.. ఇంకా పలు ఆర్థిక వ్యవహారాల్లో ఉద్యోగుల "Pay Slip" చాలా అవసరం పడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పే స్లిప్ అనివార్యం. అయితే.. గతంలో పే స్లిప్స్ హార్డ్ కాపీ రూపంలో ఇచ్చేవారు. కానీ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో.. అన్నీ ఆన్​లైన్​ అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ ఉద్యోగుల పే స్లిప్పులను కూడా ఆన్​ లైన్​ లోనే ఉంచుతున్నారు. మరి, ఏ వెబ్ సైట్ నుంచి డౌన్​లోడ్ చేసుకోవాలి? ఈ స్లిప్పుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? వంటి వివరాలు చూద్దాం.

IFMIS అంటే..?

What is IFMIS TS Pay Slip 2023

IFMIS అనగా.. "ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ & ఇన్ఫర్మేషన్ సిస్టమ్". తెలంగాణ ఆర్థిక శాఖ యొక్క ప్రధాన ప్రక్రియలను ఆటోమేట్ చేసే ఒక విప్లవాత్మక వ్యవస్థ ఇది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల వివరాలు, అలవెన్సులు, డిడక్షన్స్, ఇంక్రిమెంట్లను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు.. https://ifmis.telangana.gov.in/ అనే వెబ్​ సైట్​ను రాష్ట్ర ఆర్థిక శాఖ ఏర్పాటు చేసింది.

IFMIS పే స్లిప్​ లో.. ఏమేం ఉంటాయి..?

What is in IFMIS TS Pay Slip 2023 :

  • ఉద్యోగి వివరాలు: పేరు, ID, హోదా, విభాగం మొదలైనవి..
  • ఆదాయం: బేసిక్ శాలరీ, డియర్‌నెస్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్, ప్రత్యేక అలవెన్సులు
  • తగ్గింపులు: ప్రావిడెంట్ ఫండ్, ఆదాయపు పన్ను, వృత్తిపరమైన పన్ను, రుణ వాయిదాలు మొదలైనవి..
  • అలవెన్సులు: మెడికల్, ట్రావెల్, అలవెన్స్ మొదలైనవి.
  • స్థూల జీతం: తగ్గింపులకు ముందు మొత్తం జీతం
  • నికర జీతం: తగ్గింపుల తర్వాత ఉద్యోగి పొందే మొత్తం.

మీ జీతం పెరిగిందా?.. ఖర్చులను తగ్గించి ఇన్వెస్ట్​ చేసుకోండిలా!

IFMIS పే స్లిప్​ వల్ల ఉపయోగాలేంటి..?

Uses of IFMIS TS Pay Slip 2023 :

  • TS IFMIS ప్లే సిప్​ వల్ల ఉద్యోగులకు పలు ఉపయోగాలు ఉన్నాయి.
  • ఉద్యోగులకు వారి వేతనం గురించి సంపూర్ణ సమాచారాన్ని అందిస్తుంది.
  • ఎంప్లాయీస్ తమ ఆదాయాలను ఖచ్చితంగా ట్రాక్ చేయగలరు.
  • పే స్లిప్‌ చూసుకోవడం ద్వారా.. వేతనాల్లో ఏవైనా వ్యత్యాసాలుంటే గుర్తించవచ్చు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావచ్చు.
  • ముఖ్యంగా.. ఈ పే స్లిప్ మీ ప్రధాన ఇన్​కమ్ ప్రూఫ్​గా పనిచేస్తుంది
  • బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడం.. క్రెడిట్ కార్డులు వంటి వాటికి దరఖాస్తు చేసుకోవడానికి పే స్లిప్ చాలా అవసరం.

ఎలా డౌన్​లోడ్ చేసుకోవాలి..?

How to Download IFMIS TS Pay Slip 2023

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://ifmis.telangana.gov.in/ ను సందర్శించాలి.
  • ఆ తర్వాత ఎంప్లాయ్ ID, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ కావాలి.
  • ఇప్పుడు హోమ్ పేజీలోని Pay Slip ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • అనంతరం ఎంప్లాయ్ కోడ్‌, క్యాప్చా నమోదు చేసి సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయాలి.
  • ఉద్యోగి పేరు, ఫోన్ నంబర్ వంటి వివరాలు కనిపిస్తాయి.
  • మీ వివరాలను చూసుకున్న తర్వాత.. Send OTP ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • రిజిస్టర్డ్​ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఫిల్ చేసి Submit ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు.. డ్రాప్-డౌన్ జాబితా నుండి నెల, సంవత్సరాన్ని సెలక్ట్ చేసుకొని.. జనరేట్ పే స్లిప్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • అంతే.. పే స్లిప్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు. లేదా.. PDF ఫైల్‌ను కూడా సేవ్ చేసుకోవచ్చు.

'ప్రభుత్వ ఉద్యోగుల జేబుల్లో రూ.1,000 మాత్రమే ఉండాలి'

'వారంతా కచ్చితంగా JIO సిమ్​ వాడాల్సిందే'.. ప్రభుత్వం కీలక ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.