రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై ఐసీఎంఆర్ సర్వే నిర్వహించింది. మే 12 నుంచి 17 వరకు జనగామ, కామారెడ్డి, నల్గొండలో సేకరించిన 1200 నమూనాల్లో కేవలం నలుగురికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు తమ నివేదికలో తెలిపింది. అలాగే హైదరాబాద్‌లోని 5 కంటైన్మెంట్ జోన్లలో సేకరించిన 500 నమూనాల్లో 15 మందికి కరోనా సోకినట్లు పేర్కొంది. ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ తేల్చి చెప్పిందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది.
తెలంగాణలో కరోనా సామాజిక వ్యాప్తి లేదు: ఐసీఎంఆర్
తెలంగాణలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ సర్వేలో వెల్లడైందని వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో అతి తక్కువ మందికి కొవిడ్-19 సోకినట్లు ఐసీఎంఆర్ సర్వేలో తేలిందని అధికారులు తెలిపారు.