ETV Bharat / state

మాదకద్రవ్యాల ముఠాలకు కేంద్రంగా హైదరాబాద్‌.. వారికి సహకరిస్తుందెవరు?

Drug pedlers: అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలకు హైదరాబాద్‌ కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఖరీదైన మత్తుమందుల వ్యవహారంలో అంతర్జాతీయ ముఠాలు స్థానికులతో జట్టు కట్టినట్లు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల శంషాబాద్‌ విమానాశ్రయంలో వరుసగా దొరుకుతున్న మాదకద్రవ్యాలు ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

Drug pedlers
మాదకద్రవ్యాలు
author img

By

Published : May 16, 2022, 10:16 AM IST

Updated : May 16, 2022, 10:47 AM IST

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు హైదరాబాద్‌ కేంద్ర స్థానంగా మారిందా..? అంటే అవుననే అంటున్నారు అధికారులు. ముఖ్యంగా విదేశాల నుంచి దిగుమతి అవుతున్న ఖరీదైన మత్తుమందుల వ్యవహారంలో అంతర్జాతీయ ముఠాలు స్థానికులతో జట్టు కట్టినట్లు భావిస్తున్నారు. ఇటీవల శంషాబాద్‌ విమానాశ్రయంలో వరుసగా దొరుకుతున్న మాదకద్రవ్యాలను హైదరాబాద్‌ అవసరాల కోసం పంపలేదని, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేందుకే ఇక్కడకు సరఫరా చేసినట్లు గుర్తించిన అధికారులు.. పాత్రధారుల ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

గత ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకూ శంషాబాద్‌ విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు దాదాపు రూ.220 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుకున్నారు. గ్రాము రూ.లక్ష ధర పలికే కొకైన్‌, హెరాయిన్‌ను దక్షిణాఫ్రికా నుంచి ఎగుమతి చేశారు. మొదట్లో దీన్ని మామూలు వ్యవహారంగానే పరిగణించినప్పటికీ.. వరుసపెట్టి సరఫరా అవుతుండటంతో అధికారులు తీవ్రంగా తీసుకున్నారు. సాధారణంగా ఇలాంటి కేసులలో రవాణాదారులే దొరుకుతారు. వీటిని తీసుకోవాల్సిన వారి వివరాలు ఉండవు. అందుకే ఫలితం ఉండదన్న ఉద్దేశంతో మత్తుమందుల స్వీకర్తల ఆచూకీకి ప్రయత్నించరు. కానీ ఇటీవల ఒకేసారి రూ.80 కోట్ల విలువైన కొకైన్‌ దొరకడంతో అధికారుల ఆలోచనా విధానం మారింది. అసలు ఇంత పెద్దమొత్తంలో మాదకద్రవ్యాలు దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు ఎందుకు ఎగుమతి చేస్తున్నారనే దానిపై దృష్టి సారించారు. ఇందుకోసం ఇతర దర్యాప్తు సంస్థల సహకారం తీసుకుంటున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం దిగుమతి అవుతున్న ఈ మత్తుమందుల్లో కొంత ముంబయి, బెంగళూరు, దిల్లీ వంటి నగరాలకు, మిగతాది తూర్పు ఆసియా దేశాలకు ఎగుమతి చేసేందుకని తేలింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ను దిగుమతి కేంద్రంగానే అంతర్జాతీయ ముఠాలు వినియోగించుకుంటున్నాయని నిర్ధారణకు వచ్చిన అధికారులు.. సహకరిస్తున్న స్థానికులు ఎవరనే దానిపై దృష్టి సారించారు.

దక్షిణాఫ్రికా నుంచే ఇక్కడి గదుల బుకింగ్‌..

మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న విదేశీయులను గుర్తించడం, పట్టుకోవడం ఇక్కడి దర్యాప్తు సంస్థలకు సాధ్యం కాదు. అందుకే వీరికి సహకరిస్తున్న స్థానికుల ఆచూకీ కనుగొనడం ద్వారా చిక్కుముడి విప్పవచ్చన్న ఆశాభావంతో అధికారులు ప్రయత్నిస్తున్నారు. మత్తుమందులు తీసుకొస్తున్న రవాణాదారుల కోసం హైదరాబాద్‌లో హోటల్‌ గదులను దక్షిణాఫ్రికాలోనే బుక్‌ చేస్తున్నారు. రవాణాదారులు క్షేమంగా దిగాక.. వారు ఏ హోటల్‌కు వెళ్లాలన్నది వాట్సప్‌ సందేశం వస్తుంది. వీరి కోసం బుక్‌చేసిన హోటళ్లకు దర్యాప్తు అధికారులు వెళ్లినప్పుడు వాటిని ప్రపంచ పర్యటనలు ఏర్పాటు చేసే ఏజెన్సీ ద్వారా బుక్‌ చేసినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ ఏజెన్సీ ద్వారా ఎవరు బుక్‌ చేశారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని గుర్తించినా విచారణ కోసం ఇక్కడకు రప్పించడం కుదరదు. కానీ వీరి వివరాలు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు అప్పగించడం వల్ల కొంతయినా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ వీరి కృషి ఫలించి అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు పాత్రధారులను అదుపులోకి తీసుకునే పక్షంలో హైదరాబాద్‌లో వారికి సహకరిస్తున్న వారి వివరాలు తెలుసుకోవచ్చన్నది అధికారుల ఆలోచన.

ఇవీ చూడండి: 'పార్శిల్ రాలేదని ఫోన్​ చేశాడు.. పోలీసులకు పట్టుబడ్డాడు'

Last Updated : May 16, 2022, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.