హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం ముందు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. దాదాపు వంద అడుగులతో రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని సౌత్ రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవికుమార్ ఆవిష్కరించారు. ప్రముఖ స్థలాల్లో భారీ జాతీయ జెండాలను ఉంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. పతాకం చుట్టూ అధునాతన విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. రాత్రి వేళల్లో ఈ జెండా చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుందని అన్నారు.
ఇదీ చూడండి : ప్రశాంతంగా ప్రారంభమైన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష