నటీనటులతోహోలీ సంబురాలు...
ఐమాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో సినీ, బుల్లి తెర నటీనటులు పాల్గొని యువతతో కలిసి ఉత్సహంగా హోలీ ఆడారు. బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఫలక్నూమాదాస్ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. కథానాయిక అర్చన రంగులతో తడిసిముద్దయ్యారు. అందరూ సహజసిద్ధమైన రంగులతోనే హోలీ సంబురాలు జరుపుకోవాలని కోరారు.
టమాటాలు, బురదతో సందడి...
వర్షపు నృత్యం, టమాటా, బురద హోలీలతో పర్యావరణ హితమైన వేడుకలను జరుపుకోవటం ఆనందంగా ఉందని యువత హర్షం వ్యక్తం చేశారు.
రంగులమయం కావాలి...
గల్లీలన్నీ సప్తవర్ణశోభితంగా మార్చే హోలీ ప్రతి ఒక్కరి జీవితాన్ని రంగులమయం చేయాలని నగరవాసులు ఆకాంక్షించారు.
ఇవీ చూడండి:రాజకీయ నేతలైనా 'రంగు పడాల్సిందే'