ETV Bharat / state

త్వరలో అమీర్​పేటలో హెచ్‌ఎండీఏ కార్యకలాపాలు

author img

By

Published : Jun 15, 2020, 9:30 AM IST

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ అధికారిక కార్యకలాపాలు త్వరలో అమీర్​పేటలో ప్రారంభం కానున్నాయి. తార్నాకలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని మరో 15 రోజుల్లో దశలవారీగా తరలించనున్నారు.

hmda-operations-soon-in-ameerpet-area
త్వరలో అమీర్​పేటలో హెచ్‌ఎండీఏ కార్యకలాపాలు

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) అధికారిక కార్యకలాపాలు మరో పదిహేను రోజుల్లో అమీర్‌పేట నుంచి కొనసాగనున్నాయి. తార్నాక నుంచి ప్రధాన కార్యాలయాన్ని అక్కడికి తరలించే ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. దశలవారీగా ఒక్కో విభాగాన్ని తరలిస్తున్నారు. ఇప్పటికే ఇంజినీరింగ్‌ విభాగం తరలింపు ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు వివరించారు.

అమీర్‌పేట మైత్రీవనం వద్ద

ఏడాదిన్నర కిందటే.. మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన, ఎల్‌ఆర్‌ఎస్‌/బీఆర్‌ఎస్‌, టీఎస్‌ ఐపాస్‌, భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులు, ఛేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌(సీఎల్‌యూ), నిరభ్యంతర పత్రాలు, ఆక్యుపెన్సీ తదితర ధ్రువీకరణ పత్రాలను హెచ్‌ఎండీఏ జారీ చేస్తోంది. తార్నాకలో ప్రధాన కార్యాలయం ఉన్నా.. ఏ విభాగం ఎక్కడుందో తెలియని పరిస్థితి. పైగా సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయానికి దూరం. ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, అర్బన్‌ ఫారెస్ట్రీ, ఎస్టేట్స్‌, అడ్మినిస్ట్రేషన్‌ విభాగాలన్నీ ఒకేచోట ఉండేలా అమీర్‌పేటకు తరలించాలని ఏడాదిన్నర కిందటే నిర్ణయించారు. హెచ్‌ఎండీఏకు ప్రధాన వాణిజ్య భవనాల్లో అమీర్‌పేట మైత్రీవనం వద్దనున్న స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌ ఒకటి. ఈ భవనంలోని నాలుగు, అయిదు, ఏడు అంతస్తులను హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయానికి కేటాయించి తరలింపు ప్రక్రియ మొదలు పెట్టారు.

ఇదీ చూడండి : రైతుబంధు సొమ్ము ఎప్పుడిస్తారు? ఎంత మందికిస్తారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.