ETV Bharat / state

గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ను స్వీకరించిన డీసీపీ పద్మజ

author img

By

Published : Sep 29, 2020, 6:57 PM IST

మానవాళికి దోహదపడే విధంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని అవే మనం భావితరాలకు ఇచ్చే గిఫ్ట్ అని బాలానగర్ జోన్ డీసీపీ పద్మజ అన్నారు. గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా హైదరాబాద్​ శాపూర్​నగర్​లో ఉన్న డీసీపీ కార్యాలయ ఆవరణలో ఆమె మొక్కలు నాటారు.

green-challenge-accepted-by-balanagar-zone-dcp-padmaja
గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ను స్వీకరించిన డీసీపీ పద్మజ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో భాగంగా శాపూర్​నగర్​లో ఉన్న బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయ ఆవరణలో డీసీపీ పద్మజ మొక్కలను నాటారు. మొక్కలను నాటడమే కాకుండా వాటిని పెంచి పోశించే బాధ్యత చాలెంజ్ స్వీకరించిన వారే చూసుకోవాలని ఆమె తెలిపారు. తమ కార్యాలయం ఆవరణలో సుమారు 1800 మొక్కలను నాటామని.. వాటి పోషణను తమ సిబ్బంది ఒక బాధ్యతగా స్వీకరించి పోషిస్తున్నారని పద్మజ వెల్లడించారు. తెలంగాణలో గతంలో 25% ఫారెస్ట్ ఏరియా ఉండేదని, ఇప్పడు 4.5% పెరిగి 29.5% కవర్ అయ్యిందనే విషయం నేషనల్ ఫారెస్ట్ అధికారులు ఓ ఆర్టికల్లో తెలిపారని ఆమె వివరించారు. భారత దేశంలో 5వ స్దానంలో ఉన్న తెలంగాణ ఫారెస్ట్ ఏరియా త్వరలో మొదటి స్థానంలోకి రావాలని తాను కోరుకుంటున్నానన్నారు.

అలాగే "మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి, సైబరాబాద్ డీసీపీ క్రైమ్ రోహిణిలకు ఆమె ఛాలెంజ్ విసిరారు". ప్రతి ఒక్కరు తమ ప్రాంతాల్లో 3 మొక్కలను నాటి గ్రీన్ తెలంగాణ చేయాలని కోరారు. సిబ్బందికి తమ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఖాళీ స్దలంలో మొక్కలను నాటాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: కలుషితమయంగా జలవనరులు.. చెరువుల్లో చేరుతున్న వాడుక నీరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.