ETV Bharat / state

యువత వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే అవకాశం ఉంది: గవర్నర్

author img

By

Published : Oct 1, 2020, 5:22 AM IST

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుందని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్​ అన్నారు. వ్యవసాయం లాభాసాటి అయ్యే అవకాశం ఉన్నందున... యువత దీనిని వృత్తిగా స్వీకరించే అవకాశం ఉందన్నారు.

governor thamili sai soundara rajan virtual meeting on new agriculture acts
యువత వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే అవకాశం ఉంది: గవర్నర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తాయని గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్​ అన్నారు. ఇప్పటికీ రైతులు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్‌... ఈ చట్టాల ద్వారా ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాబార్డు ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో గవర్నర్ వర్చువల్​ భేటీ అయ్యారు.

కనీస మద్దతు ధర, ప్రభుత్వం కొనుగోళ్లు కొనసాగటంపై ఆందోళలను దూరం చేసేందుకు రైతులకు మరింత అవగాహన కల్పించాలని గవర్నర్ అన్నారు. ఈ చట్టాలను వీటిని కొనసాగించనున్నట్టు కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసిందని... వీటి వల్ల వ్యవసాయం లాభసాటి అయ్యే అవకాశం ఉన్నందున యువత వ్యవసాయాన్ని వృత్తిగా స్వీకరించే వీలు ఉంటుందన్నారు. లాక్‌డౌన్‌లో కూడా రైతులు మన కోసం పంటలు పండించారని... మన దేశానికి వ్యవసాయం వెన్నుముక లాంటిదని గవర్నర్ వెల్లడించారు.

ఇదీ చూడండి: 'ఆరోగ్యంగానే ఉన్నా.. అందరికీ కృతజ్ఞతలు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.