ETV Bharat / state

రాష్ట్ర ప్రజారవాణా వ్యవస్థలో సరికొత్త అంకం

రాష్ట్ర ప్రజారవాణా వ్యవస్థలో సరికొత్త అంకం ప్రారంభం కానుంది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు సగం సగం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 5,100 ప్రైవేట్ బస్సులకు వివిధ మార్గాల్లో రవాణా అనుమతులు ఇవ్వనున్నారు. ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. ఈ నెల ఐదో తేదీ అర్ధరాత్రిలోగా విధుల్లో చేరకపోతే మిగతా 5,100 కూడా ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది.

రాష్ట్ర ప్రజారవాణా వ్యవస్థలో సరికొత్త అంకం
author img

By

Published : Nov 3, 2019, 5:19 AM IST

Updated : Nov 3, 2019, 7:29 AM IST

రాష్ట్ర ప్రజారవాణా వ్యవస్థలో సరికొత్త అంకం

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం... ప్రజారవాణా వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్​లో ఎలాంటి తలనొప్పులు, ఇబ్బందులు లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రజలు, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని రవాణా వ్యవస్థకు సంబంధించి మంచి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి ఆర్టీసీ 5,100 బస్సులు నడిపితే, మిగతా 5,100 ప్రైవేట్ బస్సులకు రవాణా అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2,100 అద్దె బస్సులకు కూడా స్టేజి క్యారియర్లుగా అనుమతులిస్తామని చెప్పారు. చెరిసగం బస్సులు ఉండడం వల్లే ఎవరూ బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి రాదని అభిప్రాయపడ్డారు.

ప్రైవేటు బస్సులు ప్రభుత్వ నియంత్రణలోనే...

ప్రైవేట్ బస్సులూ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని, రవాణాశాఖ విధివిధానాలకు లోబడే ఛార్జీలు సహా అన్ని అంశాలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్నట్లుగానే పాసులన్నీ కూడా యథాతథంగా చెల్లుబాటవుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మోటారు వాహనాల సవరణ చట్టానికి లోబడే రాష్ట్ర ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఐదో తేదీ లోపు బేషరతుగా విధుల్లో చేరాలి

కార్మికులు చేస్తోన్న సమ్మె చట్టవిరుద్ధమని మరోమారు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్... కార్మికసంఘాల నేతలు అనవసర డిమాండ్లతో కార్మికులను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిందని సీఎం స్పష్టం చేశారు. నాలుగేళ్లలో 67శాతం వేతనాలు పెంచాక కూడా మిగతా డిమాండ్లు అర్థం లేనివని అన్నారు. కార్మికులపై తమకు ఎలాంటి ద్వేషం లేదన్న ముఖ్యమంత్రి... వారికి చివరి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల ఐదో తేదీలోపు బేషరతుగా విధుల్లో చేరాలని పిలుపునిచ్చిన సీఎం... వారికి మాత్రమే రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ ఐదో తేదీ లోపు కార్మికులు విధుల్లో చేరకపోతే ఆరో తేదీ తర్వాత మిగతా 5,100 రూట్లలోనూ ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోకపోతే తెలంగాణ ఆర్టీసీ రహిత రాష్ట్రం అవుతుందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ఎప్పటికైనా నిర్ణయం తీసుకోక తప్పదన్న ముఖ్యమంత్రి... కార్మికసంఘాలు పూర్తి బాధ్యతారహితంగా చేస్తోన్న సమ్మె కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయని పేర్కొన్నారు.

ఇవీ చూడండి: 'ఆరోగ్యకర పోటీ కోసమే... ప్రైవేటు ఆలోచన'

File : TG_Hyd_04_03_Govt_on_Transport_Pkg_3053262 From : Raghu Vardhan Note :Use ACE Media Feed ( ) రాష్ట్ర ప్రజారవాణా వ్యవస్థలో సరికొత్త అంకం ప్రారంభం కానుంది. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు సగం సగం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం విధానపరనిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగా 5100 ప్రైవేట్ బస్సులకు వివిధ మార్గాల్లో రవాణా అనుమతులు ఇవ్వనున్నారు. పూర్తిగా రవాణాశాఖ నియంత్రణలోనే ప్రైవేట్ బస్సులు నడవనున్నాయి. అటు ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. ఈ నెల ఐదో తేదీ అర్ధరాత్రిలోగా విధుల్లో చేరాలని కోరిన ముఖ్యమంత్రి కేసీఆర్... విధుల్లో చేరకపోతే మిగతా 5100 కూడా ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది...లుక్ వాయిస్ ఓవర్ - 01 ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం... ప్రజారవాణా వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకొంది. భవిష్యత్ లో ఎలాంటి తలనొప్పులు, ఇబ్బందులు లేకుండా ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్న ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రజలు, రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని రవాణావ్యవస్థకు సంబంధించి మంచి నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి ఆర్టీసీ 5100 బస్సులు నడిపితే, మిగతా 5100 ప్రైవేట్ బస్సులకు రవాణా అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2100 అద్దె బస్సులకు కూడా స్టేజి క్యారియర్లుగా అనుమతులిస్తామని చెప్పారు. చెరిసగం బస్సులు ఉండడం వల్లే ఎవరూ బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి రాదని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ బస్సులు కూడా పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయని, రవాణాశాఖ విధివిధినాలకు లోబడే ఛార్జీలు సహా అన్ని అంశాలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్నట్లుగానే పాసులన్నీ కూడా యధాతథంగా చెల్లుబాటవుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మోటారు వాహనాల సవరణ చట్టానికి లోబడే రాష్ట్ర ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. బైట్ - కె.చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి వాయిస్ ఓవర్ - 02 కార్మికులు చేస్తోన్న సమ్మె చట్టవిరుద్ధమని మరోమారు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్... కార్మికసంఘాల నేతలు అనవసర డిమాండ్లతో కార్మికులను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీని విలీనం చేసే ప్రసక్తే లేదని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించిందని సీఎం స్పష్టం చేశారు. నాలుగేళ్లలో 67శాతం వేతనాలు పెంచాక కూడా మిగతా డిమాండ్లు అర్థం లేనివని అన్నారు. కార్మికులపై తమకు ఎలాంటి ద్వేషం లేదన్న ముఖ్యమంత్రి... వారికి చివరి అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల ఐదో తేదీలోపు బేషరతుగా విధుల్లో చేరాలని పిలుపునిచ్చిన సీఎం... వారికి మాత్రమే రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. కార్మిక సంఘాల మాయలో పడి జీవితాలు రోడ్డున పడేసుకోవద్దన్న ఆయన... కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు కూడా ఈ విషయమై ఆలోచించాలని సూచించారు. ఒకవేళ ఐదో తేదీ లోపు కార్మికులు విధుల్లో చేరకపోతే ఆరోతేదీ తర్వాత మిగతా 5100 బస్సులకు కూడా ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇస్తామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోపోతే రాష్ట్రం ఆర్టీసీ రహిత రాష్ట్రం అవుతుందని వ్యాఖ్యానించారు. బైట్ - కె.చంద్రశేఖర్ రావు, ముఖ్యమంత్రి ఎండ్ వాయిస్ ఓవర్ - రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా ఎప్పటికైనా నిర్ణయం తీసుకోకతప్పదన్న ముఖ్యమంత్రి... కార్మికసంఘాలు పూర్తి బాధ్యతాయుతంగా చేస్తోన్న సమ్మె కారణంగానే ఈ పరిస్థితులు తలెత్తాయని వ్యాఖ్యానించారు.
Last Updated : Nov 3, 2019, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.