ETV Bharat / state

ముషీరాబాద్​లో త్రివర్ణ పతాకం ఎగురవేసిన జీహెచ్​ఎంసీ కార్మికురాలు - ముషీరాబాద్​లో త్రివర్ణ పతాకం ఎగురవేసిన జీహెచ్​ఎంసీ కార్మికురాలు

గణతంత్ర వేడుకల్లో ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు త్రివర్ణ పతాకం ఎగుర వేయడం సర్వ సాధారణం. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పద్మశాలి కాలనీలో మాత్రం జీహెచ్​ఎంసీ కార్మికురాలు​ మువ్వన్నెల జెండా ఎగురవేశారు.

ghmc sweeper hoisted The national flag on republic day in hyderabad
ముషీరాబాద్​లో త్రివర్ణ పతాకం ఎగురవేసిన జీహెచ్​ఎంసీ కార్మికురాలు
author img

By

Published : Jan 27, 2020, 11:44 AM IST

హైదరాబాద్​ ముషీరాబాద్​ నియోజకవర్గంలోని పద్మశాలి కాలనీలో 20 సంవత్సరాలుగా జీహెచ్ఎంసీకి కార్మికురాలు సంతోషమ్మ రోడ్లు శుభ్రం చేస్తోంది. ఆమె కృషిని గుర్తించిన పద్మశాలి సంఘం ఈ ఏడాది గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాను ఆమె చేత ఆవిష్కరింపజేశారు.

తమ కాలనీలో సుదీర్ఘకాలంగా వీధులను శుభ్రం చేస్తున్న జీహెచ్ఎంసీ కార్మికుల సేవలను గుర్తించి కార్మికుల చేత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని భావించినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. అలాగే రాజపేట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ పాత్రికేయునికి సన్మానం చేసినట్లు వెల్లడించారు.

ఈ కాలనీవాసులు తమకు ఇచ్చిన గౌరవం మరువలేనిదని జీహెచ్ఎంసీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.

Intro:గణతంత్ర దినోత్సవం వేడుకల్లో భాగంగా కవాడిగూడ లోని పద్మశాలి కాలనీ వాసులు వినూత్నంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు

Body:గణతంత్ర వేడుకలు గుర్తుకు రాగానే ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు త్రివర్ణ పతాకం ఎగుర వేస్తారని సర్వ సాధారణం... కానీ హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని పద్మశాలి కాలనీ వాస్తవ్యులు వినూత్నంగా త్రివర్ణపతాకాన్ని ఎగరవేయించారు... ప్రధానంగా పద్మశాలి కాలనీలో గత 20 సంవత్సరాలుగా జిహెచ్ఎంసి కి చెందిన ఓ మహిళ రోడ్లను శుభ్రం చేస్తుంది ఆ మహిళతో జాతీయ పతాకాన్ని ఈ గణతంత్ర వేడుకల్లో వేయించాలని పద్మశాలి కాలనీ సంక్షేమ సంఘం నిర్ణయించింది.... ఈ మేరకు జిహెచ్ఎంసి స్వీపర్ సంతోషమ్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు..... తమ కాలనీలో సుదీర్ఘకాలంగా వీధులను శుభ్రం చేస్తున్న జిహెచ్ఎంసి కార్మికుల సేవలను గుర్తించి కార్మికుల చేత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వినూత్నంగా భావించి స్వర్ణ పతకాన్ని ధరించినట్లు సంఘం ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు.. అలాగే రాజపేట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఓ పాత్రికేయుడు కి సన్మానం చేసినట్లు ఆయన వివరించారు...... ఈ కాలనీవాసులు తమకు ఇచ్చిన గౌరవం మరువలేనిదని జిహెచ్ఎంసి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు ఈ కాలనీలో సుదీర్ఘకాలంగా వీధులను శుభ్రం చేస్తున్న తమ సేవలను గుర్తించి తమలోని ఓ కార్మికులతో జాతీయ పతాకాన్ని ఎగురవేయడంతో పాటు సన్మానించడం చిరస్మరణీయమని జిహెచ్ఎంసి కార్మికురాలు శంకరమ్మ ఆశాభావం వ్యక్తం చేశారు.....

బైట్..... ఆంజనేయులు, సంఘం ప్రధాన కార్యదర్శి
బైట్...... శంకరమ్మ ,,జిహెచ్ఎంసి కార్మికురాలు

Conclusion:ముషీరాబాద్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసి కార్మికులకు ఉత్తమ గుర్తింపు లభించింది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.