హైదరాబాద్ వెస్ట్ శ్రీనివాస్నగర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి బిల్డింగ్లో నుంచి పొగలు రావటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
బ్యాంకులోని ఏసీ విభాగంలోని బాక్సులు పేలి విద్యుదాఘాతం జరగడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. బ్యాంకుపైనే బాలికల వసతి గృహం ఉండటం, పొగలను సకాలంలో గుర్తించి అదుపు చేయటం వల్ల భారీ ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి : నగరంలో వరుణుడు... వెంటే గాలి...!