ETV Bharat / state

Fever Survey in Telangana: 'రాష్ట్రంలో రేపట్నుంచి ఫీవర్‌ సర్వే.. కోటి కిట్లు సిద్ధం'

Fever Survey in Telangana: కరోనా, ఒమిక్రాన్‌ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఫీవర్‌ సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ రెండో దశలో మంచి ఫలితాలిచ్చిన ఫీవర్ సర్వేను మరోమారు చేపట్టడం ద్వారా ప్రజలకు ప్రాథమికస్థాయిలోనే వైద్యం అందించాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇందుకోసం కోటి హోం ఐసోలేషన్ కిట్లను సిద్ధం చేసినట్లు సర్కారు తెలిపింది. ఫీవర్ సర్వేతో పాటు టీకాల కార్యక్రమంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించిన ప్రభుత్వం... ఎంత మందికైనా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.

Fever Survey in Telangana
తెలంగాణలో ఫీవర్‌ సర్వే
author img

By

Published : Jan 20, 2022, 6:54 PM IST

రాష్ట్రంలో మళ్లీ ఫీవర్ సర్వేకు సర్కారు సన్నద్ధం: హరీశ్‌రావు

Fever Survey in Telangana: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో మరోమారు జ్వర సర్వే చేపట్టేందుకు ప్రభుత్వం సంకల్పించింది. రేపటి నుంచే జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి మెడికల్ కిట్ల పంపిణీ చేయాలని నిర్ణయించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యారోగ్యశాఖ అధికారులతో మంత్రులు హరీశ్‌ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు దృశ్యమాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో కరోనా పరిస్థితి, నియంత్రణా చర్యలు, వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించారు. పంచాయతీరాజ్, పురపాలకశాఖ అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకొని ఐదు రోజుల్లో ఇంటింటి సర్వే పూర్తి చేయాలని వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఇందుకోసం సిద్ధం చేసిన కోటి కిట్లను ఇప్పటికే గ్రామాల స్థాయి వరకు చేర్చినట్లు హరీశ్‌ రావు తెలిపారు. ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 340 మెట్రిక్ టన్నులకు పెంచామన్న ఆయన... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 500 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు యత్నిస్తున్నట్లు వివరించారు.

ఉచితంగా కిట్లు

రాష్ట్రంలో 56 వేల కొవిడ్‌ పడకలు ఉన్నా.. కరోనాతో ఆస్పత్రిలో చేరే వారు చాలా తక్కువ. ఈ సమయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కరోనా నిబంధనలు పాటించాలి. లక్షణాలు ఉన్నట్లయితే దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో ఉచితంగా కిట్లు అందిస్తారు. రేపటి నుంచి వైద్య సిబ్బంది ఇంటింటికీ జ్వర సర్వే నిర్వహిస్తాం. ఇందుకోసం కోటి కిట్లను సిద్ధం చేశాం. ---హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

వ్యాక్సినేషన్‌లో వెనుకంజలో ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని కలెక్టర్లు, అధికారులను మంత్రి హరీశ్‌ రావు ఆదేశించారు. టీకాల రెండు డోసుల మధ్య, బూస్టర్ డోసుకు అంతరాన్ని తగ్గించాలని కేంద్రాన్ని కోరినట్లు వివరించారు. బూస్టర్‌ డోసు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్‌లో పురోగతి

వ్యాక్సినేషన్‌ సంబంధించి దేశంలోనే తెలంగాణ పురోగతి సాధించింది. మొదటి డోసులో 102 శాతం, రెండో డోసులో 72 శాతం పూర్తి చేశాం. బూస్టర్‌ డోసు, 15- 18 వయసు వారికి వ్యాక్సినేషన్‌ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లాల కలెక్టర్లను కోరాం. ---హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి

కొవిడ్ పరీక్షల కోసం ప్రభుత్వ పరంగా విస్తృతమైన ఏర్పాట్లు ఉన్నాయని వైద్యవిద్య సంచాలకులు రమేశ్‌ రెడ్డి తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులు, లేబొరేటరీలు పరీక్ష కోసం ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అన్నీ ఇక్కడే

ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత.. పరీక్షలు, చికిత్స కోసం ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అందుబాటులో ఉన్నాయి. ---రమేశ్‌ రెడ్డి, వైద్యవిద్య సంచాలకులు

ఫీవర్ సర్వే, వ్యాక్సినేషన్‌లో శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యమై విజయవంతం చేయాలని హరీశ్‌ రావు కోరారు. బస్తీ దవాఖానాలు ఆదివారం మధ్యాహ్నం వరకు పనిచేస్తాయని తెలిపారు. మేడారం జాతరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చదవండి: Covid Guidelines: రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.