ETV Bharat / state

నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తోన్న ముఠా అరెస్ట్ - హైదరాబాద్​లో నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తోన్న ముఠా అరెస్ట్

హైదరాబాద్​ జవహర్ నగర్ పోలీసులు.. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి భూములను అమ్ముతున్న 5 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

Fake documents group arrest in Hyderabad
నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తోన్న ముఠా అరెస్ట్
author img

By

Published : Jul 10, 2020, 4:31 AM IST

నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి భూములను అమ్ముతున్న 5 మంది నిందితులను హైదరాబాద్​ జవహర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జవహర్​నగర్​లోని మాజీ సైనిక ఉద్యోగుల స్థలాలను అమ్ముతూ... పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. మాజీ సైనిక ఉద్యోగుల స్థలాలను లక్ష్యంగా చేసుకొని వారి భూములను ఆక్రమించి ఇతర వ్యక్తులకు అమ్ముతున్నట్లు వెల్లడించారు. ఓ మాజీ సైనిక ఉద్యోగికి సంబంధించిన 5 ఎకరాల భూమిని అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. సైనిక అధికారులు తమ స్థలానికి వచ్చి చూడగా... ఇతర వ్యక్తులకు భూమిని అమ్మినట్లు తెలియగా... వెంటనే జవహర్​నగర్ పోలీసులను ఆశ్రయించారు. నకిలీ రబ్బరు స్టాంపులు, పత్రాలు సృష్టించి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

ఇవీ చూడండి: తెలంగాణలో కొత్తగా 1410 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.