హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో 223 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీవీఎస్ లక్ష్మణ్, మాజీ ఎంపీ వీహెచ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు పోలింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగిసింది. 3.30 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించిన అధికారులు సాయంత్రం ఆరుగంటలకు ఫలితాలు వెల్లడించారు.
క్లీన్ స్వీప్
ఈ ఎన్నికల్లో అజారుద్దీన్ ప్యానల్ వైస్ ప్రెసిడెంట్, సెక్రెటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, కౌన్సిలర్ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. హెచ్‌సీఏ చరిత్రలో ఒకే ప్యానెల్ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి. అజారుద్దీన్‌కు 147 ఓట్లు రాగా మాజీ అధ్యక్షుడు వివేక్ ప్యానెల్ మద్దతు తెలిపిన అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్ చంద్జైన్కు కేవలం 73 ఓట్లే వచ్చాయి. మరో ప్రత్యర్థి దిలీప్ కుమార్‌కు 3 ఓట్లు మాత్రమే పడ్డాయి.
క్రికెట్ అభివృద్ధిపై కేసీఆర్‌తో చర్చిస్తా
అజారుద్దీన్ ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా జాన్ మనోజ్, సెక్రెటరీగా విజయానంద్, జాయింట్ సెక్రటరీగా నరేశ్ శర్మ, కోశాధికారిగా సురేంద్ర కుమార్ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ విజయం సాధించారు. అజారుద్దీన్ మద్దతు దారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉప్పల్ స్టేడియంకు వచ్చి సంబరాలు జరుపుకున్నారు. తమకు వ్యతిరేకంగా అసలు ప్యానలే లేదని అజారుద్దీన్ విజయానందంతో అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్యానెల్‌తో సహా వెళ్లి కలుస్తానని తెలిపారు. క్రికెట్ అభివృద్ధి గురించి సీఎంతో చర్చిస్తానని వెల్లడించారు.
- ఇదీ చూడండి : క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తా: అజహరుద్దీన్