గాంధీ ఆస్పత్రిలోని చెత్త డంపింగ్ యార్డు వద్ద డీవైఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. చికిత్స పొందుతున్న రోగులు, చిన్నారులు చెత్త వల్ల అంటు రోగాలకు గురవుతున్నారని ఆరోపించారు. ఆస్పత్రిలో చిన్న పిల్లల వార్డు పక్కనే మురికి కాలువ, మార్చురీ గది ఉందని... అక్కడి నుంచి వచ్చే దుర్వాసన వల్ల అప్పుడే పుట్టిన శిశివులు కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నట్లు వివరించారు. బాధితుల వల్ల విషయం తెలుసుకున్న డీవైఎఫ్ఐ అధ్యక్షుడు మహేందర్ గాంధీలో రెండ్రోజులుగా సర్వే చేశారని తెలిపారు. చెత్త వల్లే పిల్లలు రోగాల బారిన పడుతున్నట్లు గుర్తించి చివరి రోజున చెత్త డంపింగ్ దగ్గర ధర్నా చేసినట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: శ్రీవారి సేవలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్