మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని ఐబిపి, ఐవోసి ప్లాంట్లలోకి వెళ్లే డీజిల్ పైపులైన్ల నుంచి ఆయిల్ దొంగలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి ఒక డీజిల్ ట్యాంకర్, 4 లక్షల 29 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. దొంగలించిన డీజిల్‌ను మహారాష్ట్రలోని చక్కెర కర్మాగారాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
