ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ రైతుతో ఫోన్‌లో మాట్లాడారని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. పొలాల మధ్య గట్ల పంచాయితీని ఫోన్‌లో పరిష్కరించడం ఏంటని ప్రశ్నించారు. ఇదే భూమికి మరో మహిళ భాగస్తురాలని... ఆమె ఆవేదనను మీడియాకు వినిపించిన దాసోజు ఆమెకు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యులని నిలదీశారు. భూ సమస్యలను సర్వే చేసి పరిష్కరించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సారూ... కారు... పంచర్ కాక తప్పదని జోస్యం చెప్పారు.
ఇవి చూడండి:'గడియకో అబద్ధం ఆడతారు ఆ తండ్రీ కొడుకులు'