భారీ వర్షాల వల్ల వచ్చిన వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. వరంగల్లో 50 చెరువులు ఆక్రమణకు గురయ్యాయని... కబ్జాచేసిన వారంతా ప్రస్తుతం తెరాస నాయకులేనని ఆరోపించారు. ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కూడా నీళ్లు వచ్చాయన్నారు. కరీంనగర్ జిల్లాలో రేకొండ-బొమ్మనపల్లి కల్వర్టు నిర్మించిన కాంట్రాక్టర్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే అరెస్టు చేసి... ఆయన ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు. కూలిన కల్వర్టును చూస్తే సిమెంట్ తక్కువ చేసి ఎక్కవ ఇసుకతో నిర్మించినట్టు తెలుస్తోందన్నారు. నాసిరకం కట్టడాల వల్ల చెరువుల కట్టలు తెగిపోతున్నాయన్నారు.
వరంగల్ జిల్లాలో మొత్తం అక్రమ నిర్మాలన్న మంత్రులు, ఎవరు చేశారో కూడా బయట పెట్టాలని చాడ డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాల విషయంలో చర్యలు తీసుకుని కేటీఆర్ మాట నిలబెట్టుకోవాలన్నారు. ముంపు ప్రాంత ప్రజలకు అందించాల్సిన తక్షణ సహకరంపై కేసీఆర్, కేటీఆర్కు లేఖ రాస్తామని చాడ తెలిపారు.
ఇదీ చూడండి: గుడారాల్లో పెరిగింది... నాయకత్వ పాఠాలు చెబుతోంది!