ETV Bharat / state

'ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోంమంత్రి ఓటును తొలగించాలి'

author img

By

Published : Mar 16, 2021, 8:30 PM IST

శాసన మండలి ఎన్నికల్లో అధికార తెరాస అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి‌ శశాంక్‌ గోయల్‌కు కాంగ్రెస్‌ నాయకులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన హోం మంత్రి మహమూద్‌ అలీపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

mlc elections
శాసన మండలి ఎన్నికలు

బాధ్యతాయుతమైన పదవిలో ఉంటున్న హోం మంత్రి మహమూద్ అలీ ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఆయన తెరాస అభ్యర్థికి ఓటు వేసినట్టు ప్రకటించడాన్ని తీవ్రంగా పరిగణించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి‌ శశాంక్‌ గోయల్‌కు ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అక్రమాలకు పాల్పడిందని పేర్కొన్నారు. బుద్ధభవన్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి‌, రిటర్నింగ్‌ అధికారి ప్రియాంకను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, మండలి కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి తెలిపారు.

హోంమంత్రి ఓటును తొలగించి ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టపరంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు నేతలు వెల్లడించారు. ఎన్నికల్లో ఓటర్లకు తెరాస నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు పంచారని ఆరోపించారు. తమ ఫిర్యాదుపై...ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోయినట్లయితే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళన.. నిరసనకారులు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.