హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వద్ద అథ్లెట్లు, క్రీడాకారుల ఆందోళనకు దిగారు(Concern of Athletes Gachibowli Stadium). గచ్చిబౌలి స్టేడియం స్థలాన్ని టిమ్స్‌కు కేటాయించడంపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై అథ్లెట్లు, క్రీడాకారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి స్టేడియం అథ్లెట్లు పేరేంట్స్ అసోషియషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. క్రీడా ప్రాంగణాన్ని కాపాడాలంటూ స్టేడియం ముందు భైఠాయించారు.
టిమ్స్ కోసం ప్రభుత్వం ఇప్పటికే 9ఎకరలు కేటాయించడం జరిగిందని... స్టేడియంలోని మరో 5 ఎకరాలు టిమ్స్‌కు కేటాయించాలనుకోవడం సమంజసం కాదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను అంతర్జాతీయ స్థాయిలో ఉన్నఏకైక క్రీడాప్రాంగణం గచ్చిబౌలి స్టేడియం మాత్రమేనని... ఇందులో స్థలాన్ని ఆస్పత్రికి ఇవ్వడం అన్యామంటూ ఆందోళనకు దిగారు. నిరసనలో రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడాకారులు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Flood Detector: వరద వస్తుందో లేదో ముందే తెలుసుకోవచ్చు..!