ETV Bharat / state

LPG PRICE: 15 రోజుల్లోనే మరో రూ.25 పెంపు.. నామ్‌ కే వాస్త్​గా సబ్సిడీ

సామాన్యుడిపై మరో భారం పడింది. గృహవసరాల కోసం వినియోగించే సిలిండరు ధరను మరోమారు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే 15 రోజుల్లోనే మరో రూ.25 పెంచింది. ప్రస్తుతం రాజధానిలో గృహావసరాల సిలిండరు ధర రూ.937కు చేరింది.

LPG PRICE
సిలిండరు ధర
author img

By

Published : Sep 2, 2021, 6:40 AM IST

పట్టుమని 15 రోజుల వ్యవధిలోనే వంట గ్యాస్‌ ధర మళ్లీ మండింది. గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండరు ధరను తాజాగా కేంద్రం రూ.25 పెంచింది. ఈ పెంపు బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ క్రమంలో 14.2 కిలోల వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర హైదరాబాద్‌లో రూ.937కు చేరింది. గత నెల 17వ తేదీన గ్యాస్‌ బండపై రూ.25 పెంచిన కేంద్రం.. పక్షం రోజుల్లోనే మళ్లీ మరో రూ.25 పెంచటం విమర్శలకు తావిస్తోంది. సిలిండరు ధరను ఇష్టారాజ్యంగా బాదుతున్న కేంద్ర ప్రభుత్వం వినియోగదారులకు ఇచ్చే సబ్సిడీని మాత్రం సుమారు ఏడాదిగా పెంచటం లేదు. మరోవంక.. వాణిజ్యావసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండరు ధరను గత నెలలో రూ.5 మేర తగ్గించిన చమురు సంస్థలు.. తాజాగా బుధవారం నుంచి రూ.74 పెంచాయి.

జిల్లాల వారీగా ధరలు

తెలంగాణలో 1.10 కోట్ల గృహావసరాల వంటగ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ప్రతి నెలా సుమారు 60 శాతం సిలిండర్లు పంపిణీ అవుతున్నాయి. ఈ ప్రకారం.. గ్యాస్‌బండపై ఒకసారి రూ.25 వడ్డిస్తే ప్రజలపై పడే భారం రూ.16.50 కోట్ల వరకూ ఉంటోంది. రాష్ట్రం అంతటా సిలిండర్‌ ధర ఒకేలా ఉండదు. దూరాన్ని పరిగణనలోకి తీసుకుని రవాణా ఛార్జీలను జోడించి చమురు సంస్థలు దాన్ని నిర్ణయిస్తాయి.

గొర్రెతోక సబ్సిడీ.. కొందరికి అదీ లేదు!

.

గ్యాస్‌ బండ ధర ఎంత పెరిగినా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మాత్రం ‘గొర్రెతోక బెత్తెడు’ చందంగా మారింది. ఏడాది కాలంలో ఒక్కో సిలిండరుపై రూ.287 ధర పెరిగితే సబ్సిడీ రూ.40.71 మించింది లేదు. కొన్ని రాష్ట్రాల్లో అసలు సబ్సిడీయే ఇవ్వని పరిస్థితి! సిలిండరు ధర రూ.897లోపు ఉన్న ప్రాంతాల వినియోగదారులకు అసలు సబ్సిడీ అందదు. 2013-14లో అత్యధికంగా సిలిండరు రూ.535 సబ్సిడీ ఇచ్చిన రోజులు ఉన్నాయి. తరవాత నుంచి సబ్సిడీలో కేంద్రం కోత విధిస్తూ వచ్చింది.

ఇదీ చూడండి: SCHOOLS REOPEN: బడి గంట మోగినా.. హాజరు అంతంత మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.