లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై పోలీసులు చర్యలు చేపట్టారు. మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు రోడ్లపైకి వచ్చిన మొత్తం లక్ష 22 వేల వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ద్విచక్ర వాహనాలపై లక్ష 11 వేల 500, మూడు చక్రాల వాహనాలపై 3వేల 400 కేసులు నమోదు చేయగా... నాలుగు చక్రాల వాహనాలపై 6 వేల 500 కేసులు నమోదు చేశామని పోలీసులు వివరించారు.
వీరందరిపై నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీలు, కెమెరాలతో ఫోటోలు తీయడం ద్వారా వీరిని గుర్తించామని చెప్పారు. ఇందులో 5 వేల 29 ద్విచక్ర వాహనాలు, 471 మూడు చక్రాల వాహనాలు, 243 నాలుగు చక్రాల వాహనాలను జప్తు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: వైద్య, పోలీసు సిబ్బందికి పూర్తి వేతనం.. అదనంగా నగదు ప్రోత్సాహకాలు