నల్గొండ జిల్లా చండూరు గ్రామానికి చెందిన శ్రీనివాస్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44 లోని పీసీ రెడ్డి అనే వారింట్లో వాచ్ మెన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి మతిస్థిమితంలేని కుమారుడు ఉన్నాడు. నిన్న రాత్రి బాలుడు పక్కనున్న సత్యారావు ఇంట్లో ఈత కొలనులో పడి మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:ఈ ఊరికి మహాత్మా గాంధీ దేవుడయ్యాడు