ETV Bharat / state

'కాళోజీలో మెడికల్​ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలి'

కాళోజీ మెడికల్​ యూనివర్సిటీ పీజీ మెడికల్​ హెల్త్​ కోర్సుల కౌన్సెలింగ్​లో వెనుకబడిన తరగతుల విద్యార్థులకు అన్యాయం జరుగుతోందంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​ కృష్ణయ్య ఆరోపించారు. రిజర్వేషన్లను సక్రమంగా అమలు జరిగేలా చూడాలంటూ కోఠిలోని వైద్యవిద్యా శాఖ కార్యాలయంలో మంత్రి ఈటల రాజేందర్​ను కలిసి వినతిపత్రం అందించారు.

bc welfare society central president rkrishnaih meet minister eetala rajendher for the issue of  kaloji medical seats
'కాళోజీలో మెడికల్​ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలి'
author img

By

Published : Jun 3, 2020, 7:22 PM IST

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో పీజీ మెడికల్ హెల్త్ కోర్సుల కౌన్సెలింగ్​ విషయంలో... బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల అమల్లో అన్యాయం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. ఈ వైఖరిని మార్చుకోవాలని... కోఠిలోని వైద్య విద్యాసంచాలకుల కార్యాలయంలో మంత్రి ఈటెల రాజేందర్​ను ఆయన కలిశారు. రాజ్యాంగ స్ఫూర్తికి... సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వ్యవహరిస్తోందన్నారు.

గతంలో ఎంబీబీస్ అడ్మిషన్ల విషయంలోనూ అన్యాయం చేశారని కృష్ణయ్య మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్​లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 53జీఓ తీసుకువచ్చి విద్యార్థులకు న్యాయం చేశారని... తెలంగాణలో కూడా 43జీఓ అమెంట్ చేసి 53జీఓ తీసుకవచ్చి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల అమలు విషయంలో సీఎం వెంటనే స్పందించకుంటే కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి తాళం వేస్తామని కృష్ణయ్య హెచ్చరించారు.

'కాళోజీలో మెడికల్​ రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేయాలి'

ఇవీ చూడండి: తీరాన్ని తాకిన నిసర్గ తుపాను.. గాలుల బీభత్సం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.