ETV Bharat / state

'ప్రజారోగ్యం కోసం బార్లు, రెస్టారెంట్లలో అన్ని రకాల చర్యలు చేపట్టాం'

కరోనా వేళ బార్లు, రెస్టారెంట్లలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని రెస్టారెంట్ అండ్ బార్ లైసెన్స్ అసోసియేషన్ వెల్లడించింది. పరిశుభ్రతను పాటిస్తూ తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నామని తెలిపింది. పరిమిత సంఖ్యలోనే లోపలికి అనుమతిస్తున్నామని పేర్కొంది.

bar association told that all kinds of measures, telangana bar association
బార్లలో కరోనా నిబంధనలు, బార్ అసోసియేషన్
author img

By

Published : May 9, 2021, 1:59 PM IST

రాష్ట్రంలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో ప్రజా ఆరోగ్యం దృష్ట్యా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రెస్టారెంట్ అండ్ బార్ లైసెన్స్ అసోసియేషన్ తెలిపింది. పరిశుభ్రతను పాటిస్తూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నామని పేర్కొంది. కరోనా అరికట్టడానికి తమవంతుగా కృషి చేస్తున్నామని హైదరాబాద్​లో జరిగిన సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాగంటి మనోహర్ గౌడ్ వెల్లడించారు.

భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ వంటి చర్యలు చేపట్టామని తెలిపారు. పరిమిత సంఖ్యలోనే లోపలికి అనుమతిస్తున్నామని వెల్లడించారు. గతేడాది లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేక వేలాదిమంది బార్ కార్మికులు వీధిన పడ్డారని తెలిపారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో రెస్టారెంట్, బార్ల కార్యకలాపాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: మంత్రి కొప్పుల ఈశ్వర్​కు కరోనా పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.