పాతికేళ్లుగా ఇరు తెలుగు రాష్ట్రాల అంధులకు విశిష్ట సేవలను అందిస్తున్న జాతీయ అంధుల సాధికారత సంస్థ (ఎన్‌ఈపీవీడి)ని మూసివేసే ప్రయత్నాలు జరుగుతుండడం బాధాకరమని వెల్ఫేర్ కమిటీ ఆఫ్ ద బ్లైండ్ అధ్యక్షులు వెంకటరాములు పేర్కొన్నారు. హైదరాబాద్లోని జాతీయ మానసిక వికలాంగుల కేంద్రం (ఎస్ఎంహెచ్) ఆవరణలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన దివ్యాంగుల సంక్షేమ సంఘాలు దీనిపై నిరసన చేపట్టాయి.
ఎన్‌ఈపీవీడిని ఎట్టి పరిస్థితుల్లో మూసివేయడం, ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వ అధీనంలోనే కొనసాగించాలని కోరారు. సంస్థను మూసివేస్తే దివ్యాంగుల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాల అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెనకబాటు కారణాలేవైనా ఉంటే వాటిని పరిశీలించి, సంస్థను అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాంకేతికత సహాయంతో దివ్యాంగులకు మెరుగైన శిక్షణను ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చూడండి: "కొత్త" వైరస్ ప్రాణాంతకమేమీ కాదు.. కానీ..: మంత్రి ఈటల