ETV Bharat / state

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన రేణు దేశాయి

ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ మూడో విడతలో భాగంగా నటి రేణు దేశాయి జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటారు. ప్రముఖ యాంకర్‌ ఉదయభాను తనకిచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించారు. ఈ తరానికి మొక్కలు ఏ విధంగా నాటాలో తెలియడంలేదని.. చెట్ల వల్ల కలిగే ఉపయోగాలు చెప్పడానికే ఛాలెంజ్‌ స్వీకరించినట్లు పేర్కొన్నారు.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన రేణు దేశాయి
గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన రేణు దేశాయి
author img

By

Published : Jul 3, 2020, 3:42 PM IST

Updated : Jul 3, 2020, 6:36 PM IST

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన రేణు దేశాయి

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను నటి రేణు దేశాయి స్వీకరించారు. తన కుమార్తె, కుమార్తె స్నేహితురాలుతో కలిసి హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని పార్క్‌లో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను రేణు దేశాయి స్వీకరించారు.

ఇప్పుడున్న జీవన విధానంలో మనందరం అపార్ట్‌మెంట్‌ కల్చర్‌కి అలవాటు పడ్డామని రేణు దేశాయి అభిప్రాయపడ్డారు. చిన్నతనంలో సొంత గృహాల్లో ఉండటం వల్ల చుట్టుపక్కల పెద్దవాళ్లు మొక్కలు నాటితే చూసి నేర్చుకునేవాళ్లమని తెలిపారు. అయితే ఈ తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి, పెంచాలని అనే విషయం తెలియడం లేదన్నారు.

కాబట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఉదయభాను తనకిచ్చిన ఛాలెంజ్ స్వీకరించినట్లు రేణు పేర్కొన్నారు. శుక్రవారం తన కుమార్తె ఆద్య, అమె స్నేహితురాలు యషికకు మొక్కలు ఏ విధంగా నాటాలి.. వాటి ఉపయోగం ఏంటో వివరించానని వెల్లడించారు. ఇప్పుడు నాటే మొక్కలు తక్షణమే ఫలితం ఇవ్వకున్న పది, పదిహేను సంవత్సరాల తర్వాత భవిష్యత్‌ తరాలవారు వాటి ఫలాలు అందుకుంటారని చెప్పారన్నారు.

"ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్‌కు అభినందనలు తెలియజేస్తున్నా. శుక్రవారం నా కూతురుతో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. నేను ముగ్గురికి ఛాలెంజ్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరుతున్నా. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత".

-రేణు దేశాయి, నటి

ఇదీ చూడండి: కరోనా బాధితుల పర్యవేక్షణకు బుల్లి పరికరం

Last Updated : Jul 3, 2020, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.