ETV Bharat / state

లక్ష్య సాధనకు ప్రేరణే దివిటీ!

author img

By

Published : Feb 18, 2021, 9:01 AM IST

మన జీవితాల్లో అంతర్భాగమైన గూగుల్‌, ఫేస్‌బుక్‌,  అమెజాన్‌ల సృష్టి ఏవిధంగా జరిగింది?మన ఓయో, మేక్‌ మై ట్రిప్‌, ఓలాల ప్రయాణం ఎలా మొదలైంది?మనకోసం భారత్‌ బయోటెక్‌, ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌లు రికార్డు సమయంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ చేయగలగడం వెనుక ఉన్న శక్తి ఏమిటి?వీటన్నింటి వెనుక ఉన్నది... ప్రేరణ!  జీవన నైపుణ్యాల్లో ఒకటిగా, అత్యంత ముఖ్యమైనదిగా ఇది భాసిల్లుతోంది.

లక్ష్య సాధనకు ప్రేరణే దివిటీ!
లక్ష్య సాధనకు ప్రేరణే దివిటీ!

ప్రేరణ అంటే...

ప్రేరణకు ఆంగ్ల పదమైన ‘మోటివేషన్‌’లో ‘మువ్‌’ అనే అక్షరాలున్నాయి. అంటే ‘కదులు ముందుకు’ అని అర్థం. ఈ కదలిక, చైతన్యం... ప్రగతి కోసం, వికాసం కోసం. జీవన రంగంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు...ముందుకు కదిలించేదే మోటివేషన్‌.

ఎలా జనిస్తుంది?

  • ప్రేరణ ఒక అంతర్గత మానసిక ప్రక్రియ. మనఃపథంలో రూపుదిద్దుకునే ఒక వృత్తం. ఈ నిరంతర ప్రక్రియలో 4 దశలు ఉన్నాయి.
  • మనకు నచ్చిన, బాగా అవసరమైన విష యం రేఖామాత్రంగా మెదడులో కదులుతుంది.
  • రెండో దశలో అప్పటివరకు లీలామాత్రంగా ఉన్న విషయంపై స్పష్టత ఏర్పడుతుంది. లక్ష్యంగా రూపుదిద్దుకుంటుంది.
  • మెదడు, మనసు దీనిపై పదేపదే ఆలోచించడం వల్ల దాన్ని సాధించాలన్న ఉత్సాహం నరనరాల్లో నిండుతుంది.
  • ఇది కదలికగా మారి, లక్ష్య సాధనకు సమాయత్తం చేస్తుంది.

ఎలా అలవర్చుకోవాలి?

ఏది కారణం: మోటివేషన్‌ కారణం ఎవరికి వారికి వేర్వేరుగా ఉంటున్నందువల్ల కెరియర్లో ప్రవేశించాలనుకునేవారు తమకు ప్రేరణ కలిగించేదేమిటో గుర్తించాలి. మంచి ఉద్యోగం, మంచి వేతనం.. ఇలా ఏది అంతర్గత ప్రోత్సాహం కలిగిస్తుందో స్పష్టంగా గుర్తించాలి.

సమీపంలో..: తమకు ఏది ప్రేరణ కలిగిస్తుందో దాన్ని దగ్గరగా ఉంచుకోవడం ఉత్తమం. ఇప్పటికే ఆ విజయాన్ని సాధించినవారు రోల్‌ మోడల్‌గా ఉంటే వారి ఫొటోలను స్టడీ టేబుల్‌పై పెట్టుకోవచ్చు లేదా వారు చెప్పిన వాక్యాలు కనిపించేలా ఉంచుకోవాలి.

కార్యాచరణ కీలకం: లక్ష్య సాధనే ప్రేరణ ప్రధాన ఉద్దేశం. అందుకు ప్రేరణను ఆధారంగా చేసుకుని ఉత్సాహం ఇంధనంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. ఇది లిఖిత రూపకంగా ఉంటే ఉత్తమం. దీన్ని స్వల్పకాలంగా, దీర్ఘకాలంగా విభజించుకోవడం వల్ల సాధ]న సులభమవుతుంది.

నిరంతరం: ప్రేరణ ఒక్కరోజుతో పోయేది కాదు. విజయాలకూ, లక్ష్య సాధనకూ హద్దు ఉండదు. అందుకే ప్రేరణను ఎప్పుడూ నిలుపుకోవాలి. నిరంతర ప్రేరణ ఉండేలా ఆలోచనా సరళి ఏర్పరచుకోవాలి. ఎప్పుడైనా ప్రేరణ కోల్పోతే, వాహనంలో ఇంధనం నింపుకున్న మాదిరిగా స్ఫూర్తి పొందే ప్రయత్నం చేయాలి. లక్ష్య సాధనకు ప్రేరణే దివిటీ!

నిస్తేజంగా జీవితం గడపడం వ్యర్థం. సదాశయంతో, ఆశావహ జీవితమే లక్ష్యం కావాలి. అందుకు ప్రేరణే పరమౌషధం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.