ETV Bharat / state

ఖమ్మం ఘటనపై పూర్తి విచారణ జరిపించాలి

ఖమ్మం జిల్లాలోని సంక్షేమ వసతిగృహంలో జరిగిన అగ్నిప్రమాదంలో విద్యార్థి మృతి ఘటనపై విచారణ జరిపించాలని సంక్షేమ హాస్టళ్ల పరిరక్షణ కమిటీ సభ్యులు హైదరాబాద్​లో డిమాండ్​ చేశారు. ప్రభుత్వం వసతి గృహాలపై సవతిప్రేమ చూపిస్తోందని ఆరోపించారు.

హాస్టళ్ల  పరిరక్షణ కమిటీ సభ్యులు
author img

By

Published : Jul 25, 2019, 11:42 AM IST

హైదరాబాద్​లో సంక్షేమ హాస్టళ్ల పరిరక్షణ కమిటీ సమావేశమైంది. ఖమ్మం జిల్లాలోని సంక్షేమ వసతిగృహంలో జరిగిన అగ్నిప్రమాదంలో విద్యార్థి మృతి ఘటనపై పూర్తి విచారణ చేయాలని కమిటీ సభ్యులు డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో ఏ సంక్షేమ వసతిగృహంలో సరైన వసతులు లేవని... ప్రభుత్వం సవతిప్రేమ చూపుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంచిగా ఉన్న సచివాలయం, అసెంబ్లీలను కూల్చివేసి కొత్త భవనాలు కట్టుకుంటున్నారని విమర్శించారు. శిథిలావస్థలో ఉన్న సంక్షేమ భవనాలను ఎందుకు నిర్మించడం లేదని కమిటీ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి ప్రశ్నించారు.

ఖమ్మం ఘటనపై పూర్తి విచారణ జరిపించాలి

ఇవీ చూడండి: కారు... తుపాకీ... 3కోట్ల రూపాయలు... ఓ హైజాక్ కథ

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.