ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,01,544 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 6,617 కొవిడ్ కేసులు(ap corona cases) నిర్ధరణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 18,26,751 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 57 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవటంతో ఆ రాష్ట్రంలో మృతుల సంఖ్య 12,109కి చేరింది.
24 గంటల వ్యవధిలో 10,228 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 17,43,176 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం ఏపీలో 71,466 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,07,36,435 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా తూర్పు గోదావరిలో 1,397, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 217 కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 780, పశ్చిమగోదావరిలో829, అనంతపురంలో 427, కడప 379, గుంటూరు 361, కృష్ణా జిల్లాలో407, నెల్లూరులో 364, ప్రకాశం జిల్లాలో526, శ్రీకాకుళంలో405, విశాఖలో303, విజయనగరంలో 222 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం తెలిపింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
ఇదీ చదవండి: తెలంగాణలో కొత్తగా 1,489 కరోనా కేసులు, 11 మరణాలు