ETV Bharat / state

అల్వాల్​లో​ విజృంభిస్తోన్నకరోనా.. 31 మంది టీఎస్​ఎస్​పీ సిబ్బందికి పాజిటివ్

సికింద్రాబాద్​ అల్వాల్​లో ఒకేరోజు 72 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 31 మంది టీఎస్​ఎస్​పీ సిబ్బంది ఉన్నారు. రోజురోజుకు కొవిడ్​ కేసుల సంఖ్య పెరుగుతున్నందున స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

31-tssp-police-man-got-corona-positive-at-alwal-police-station-hyderabad
అల్వాల్​లో​ విజృంభిస్తోన్నకరోనా.. 31 మంది టీఎస్​ఎస్​పీ సిబ్బందికి పాజిటివ్
author img

By

Published : Aug 1, 2020, 3:59 PM IST

హైదరాబాద్​ నగరంలోని అల్వాల్​ పరిధిలో శుక్రవారం 252 మందికి కొవిడ్​ పరీక్షలు చేయగా.. 72 మందికి పాజిటివ్​గా తేలింది. స్థానిక పోలీస్​ స్టేషన్​లో పనిచేస్తున్న 40 మంది టీఎన్ఎస్​పీ సిబ్బందిలో 31 మంది కరోనా బారినపడ్డారు. పెద్ద సంఖ్యలో కేసులు నమోదు కావడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

టీఎన్ఎస్​పీ సిబ్బంది స్థానిక పోలీస్​ స్టేషన్​లో ప్రత్యేక ఫోర్స్​గా పనిచేస్తారని... వీవీఐపీ బందోబస్తు, పండుగలు, ఇతర అవసరాలకు ఈ సిబ్బందిని వినియోగిస్తారని అల్వాల్ ఎస్తై పులి యాదగిరి తెలిపారు. కొవిడ్​ జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ పోలీసులు మహమ్మారి బారినపడడం బాధాకరమన్నారు.

నిత్యం రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా... పౌరులలో ఎక్కడా వైరస్​ భయం కానరావడం లేదు. మార్కెట్లు కిక్కిరిసిపోతున్నాయి. భౌతిక దూరం పాటిస్తున్న దాఖలాలు లేవు. పాజిటివ్ రోగులు హోం క్వారంటైన్​లో ఉంటున్నారో? లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఎస్సై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.